ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ పొందాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. విద్యార్హతలను బట్టి ఉద్యోగాలను పొందొచ్చు. అయితే విద్యార్హతలతో పాటుగా స్పోర్ట్స్ ఆడే వారికి కూడా బెస్ట్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వాలు ఉన్నతమైన ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటాయి. అంటే మీరు స్పోర్ట్స్ బాగా ఆడినా కూడా మంచి జాబ్ పొంది లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మరి మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే మీలాంటి వారికి లక్కీ ఛాన్స్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఆడేవారికి తీపికబురును అందించింది.
మీరు డిగ్రీ ఉత్తీర్ణులై క్రీడల్లో ప్రతిభ చూపినట్లైతే ఎస్బీఐలో జాబ్ పొందొచ్చు. ఎస్బీఐ స్పోర్ట్స్ కోటాలో ఆఫీసర్/క్లరికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో సాధించిన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 21-30ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్ట్ 14 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 68.
విభాగాల వారీగా ఖాళీలు:
ఆఫీసర్–17, క్లరికల్ స్టాఫ్–51.
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో సాధించిన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, క్లరికల్ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్ట్, ప్రాక్టికల్ అసెస్‌మెంట్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం:
నెలకు ఆఫీసర్ పోస్టుకు రూ.85,920, క్లరికల్ స్టాఫ్ పోస్టుకు రూ.64,480.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేది:
24-07-2024
దరఖాస్తులకు చివరి తేది:
14-08-2024