ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారందరికి నేటి నుంచి పెన్షన్లను అందజేస్తోంది. ప్రతీ నెల ఒకటవ తేదినే వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను స్వయంగా సీఎం చంద్రబాబు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ప్రారంభించనున్నారు.
NTR Bharosa Pension 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారందరికి నేటి నుంచి పెన్షన్లను అందజేస్తోంది. ప్రతీ నెల ఒకటవ తేదినే వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను స్వయంగా సీఎం చంద్రబాబు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ప్రారంభించనున్నారు.
.రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం మొత్తం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఈ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 65,18,496 మందికి ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేస్తారు.
పెన్షన్ పంపిణి రోజే దాదాపు 99 శాతం పంపిణీని పూర్తి చేయనుంది. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.
పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టడానికి సీఎం చంద్రబాబు మొదటి సారి శ్రీ సత్యసాయి జిల్లా కు వస్తున్నారు. నేడు మడకశిర నియోజకవర్గం గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని చేపడతారు.ఓ ఇంటి వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణి చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పెన్షన్లు సరిగా ఇవ్వదు అని ప్రతిపక్ష వైసీపీ ప్రచారం చేస్తోంది. దీన్ని బలంగా తిప్పికొడుతూ ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఆగస్టు 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షనర్లకు ఇవ్వాల్సిన మనీని రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ ఈ పెన్షన్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న ఉదయాన్నే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. ఇంటింటికీ వెళ్లి, లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చెయ్యాలని ఆదేశించారు.
ఈరోజే నూటికి నూరు శాతం పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలని కనీసం 96 శాతం మందికి పెన్షన్ అందాలనీ మిగిలిన వారికి ఆగస్ట్ 2వ తేది అనగా రేపు ఇచ్చి తీరాలని సూచించారు.ప్రభుత్వం ఈ పెన్షన్లను 27 కేటగిరీల వారికి ఇస్తోంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో ఏపీ ప్రభుత్వం గత నెల నుంచి పెంచిన మొత్తాన్ని అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి కూడా వృద్దులు, వితంతువులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందజేయనున్నారు.అలాగే దివ్యాంగులకు రూ.6వేల చొప్పున పెన్షన్ ఇస్తారు.