పెసలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మొలకెత్తిన గింజలు తినేవాళ్లకు పెసలు బాగా తెలుస్తాయి. అదే విధంగా పెసరట్టు అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడంటే తగ్గించేశారు.
కానీ ఇంతకు ముందు పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పెసలు తినడం ఆరోగ్యానికి చాలా మంది. పూర్వీకుల నుంచి వీటిని ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటారు. చైనా వాళ్లు పెసలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీన్ని లుడౌ ని పిలుస్తారు. పెసలు శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఇందులో ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్ వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి. పెసలు తినడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
డయాబెటీస్ కంట్రోల్:
పెసలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే కొద్దిగా తినే సరికే కడుపు నిండుతుంది. పెసలతో చేసిన స్నాక్స్ తిన్నా కూడా పెద్దగా ఏ ఇతర ఆహారం తీసుకోం. కాబట్టి రక్తంలో చక్కెర లెవల్స్ అనేవి పెరగవు. షుగర్ వ్యాధితో బాధ పడేవారు పెసలను తీసుకుంటే బెటర్.
వెయిట్ లాస్ అవ్వొచ్చు:
పెసలు తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇతర ఆహారాలు కూడా తీసుకోలేం. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఈజీగా బరువు తగ్గవచ్చు.
చర్మాన్ని రక్షిస్తుంది:
పెసల్లో విటమిన్లు బి, సి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణగా నిలుస్తాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరాణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడతాయి. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల నుండి రక్షిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది.
ఐరన్ శాతం ఎక్కువ:
పెసల్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపంతో బాధ పడేవారు పెసలను మీ ఆహారంలో చేర్చుకోండి. దీంతో రక్త హీనత సమస్య కూడా ఏర్పడదు. అనీమియా లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చు. అంతే కాకుండా జీర్ణ క్రియకు మంచిది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )