కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో మూడు రకాలు ఉంటాయి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేత కొబ్బరి. వీటిల్లో ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.
అన్నింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది వంటల్లో కూడా కొబ్బరిని ఉపయోగిస్తూ ఉంటారు. వంటను బట్టి కొబ్బరిలోని రకాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరితో చాలా రకాల వంటలు చేయవచ్చు. కొబ్బరి తినడం వల్ల చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ కొబ్బరి నుంచే కొబ్బరి నూనె తీస్తారు. మరి ఏ కొబ్బరి తింటే ఎలాంటి లాభాలు అందుతాయో.. ఏ విధంగా మేలు చేస్తుందో.. వీటిల్లో ఏది తినడం వల్ల మనకు పోషకాలు అనేవి సరైన స్థాయిలో అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేత కొబ్బరి:
లేత కొబ్బరిలో ఐరన్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, లారిక్ యాసిడ్, చైన్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్లు వంటివి లభిస్తాయి. లేత కొబ్బరి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ లేత కొబ్బరి మితంగా తీసుకోవచ్చు. ఈ లేత కొబ్బరి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. లేత కొబ్బరి తింటే గర్భిణీలకు కూడా చాలా మంచిది.
పచ్చి కొబ్బరి:
పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాపర్, సెలీనియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్ లభిస్తాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా చక్కగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. బరువు కూడా తగ్గొచ్చు.
ఏది తింటే మంచిది:
ఈ రెండింటిలో ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే లేత కొబ్బరి ఎంత తీసుకున్నా పర్వాలేదు. కానీ పచ్చి కొబ్బరి మాత్రం మితంగా తీసుకోవాలని అంటున్నారు. పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటే.. దగ్గు, నెమ్ము వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ లేత కొబ్బరితో అలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి పచ్చి కొబ్బరి కంటే లేత కొబ్బరిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )