BSNL బంపరాఫర్‌.. ఇంట్లో ఉంటూనే.. వేలల్లో సంపాదించుకునే ఛాన్స్‌

www.mannamweb.com


గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా, విన్నా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరు మార్మోగిపోతుంది. అందుకు కారణం ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వీఐ తమ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచడం. దాంతో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా తన సేవలను మెరుగుపర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 4జీ సేవలను తీసుకురాగా.. తాజాగా 5జీ సేవలను కూడా టెస్ట్‌ చేసింది. ఇదిలా ఉంచితే బీఎస్‌ఎన్‌ఎల్‌ మీకు మరో బంపరాఫర్‌ ఇస్తోంది. దీని ద్వారా.. మీరు ఇంట్లో ఉంటూనే.. ఎలాంటి పని చేయకుండా వేల రూపాయలు సంపాదించవచ్చు. ఎలా అంటే..

టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వీఐ తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుండి చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కూడా అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటుంది. అత్యుత్తమ సర్వీసులు అందించేందుకు రెడీ అవుతోంది. ఇదుగో ఈ నిర్ణయమే మీకు సంపాదనను తెచ్చి పెడుతుంది. ఎలా అంటే.. మీరు మీ ఇంటి పైకప్పుపై బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తే.. మీరు ఎంతో లాభం పొందవచ్చు. ఒక్కసారి మీ మేడ మీద బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తే.. మీరు ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. మీ రూఫ్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు ఏం చేయాలంటే..
ఇంటి మీద బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఇన్‌స్టాలేషన్‌ కోసం..

దీని కోసం ముందుగా గూగుల్ క్రోమ్‌లో ఇండస్ టవర్ అధికారిక వెబ్‌సైట్‌ను సెర్చ్ చేయండి.
ఇక్కడ వచ్చిన వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.
దీని తరువాత, మీరు స్క్రీన్ కుడి మూలలో చూపిన మూడు ఆప్షన్స్‌ చూస్తారు.
ఇక్కడ మీరు ల్యాండ్‌ఓనర్స్‌ అనే ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయండి.
ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.
అప్లై చేసిన తర్వాత, ఇండస్ టవర్ వ్యక్తులు సర్వే కోసం మీ ఇంటికి వస్తారు.
సర్వే నిర్వహించి.. అన్ని కండీషన్లకు ఓకే అంటే.. మీ ఇంటి మేడపై సెల్‌ టవర్‌ బిగిస్తారు.
ఇందుకు గాను మీకు నెలనెలా అద్దె ఇస్తారు.
అద్దె మొత్తం ఎంత అనేది కంపెనీలను బట్టీ మారుతుంటుంది.
అంతేకాక ఒప్పందం ఎన్ని సంవత్సరాలు, అది ఎంత మొత్తం అనేది నిర్ణయిస్తారు.

సంపాదనతో పాటు సమస్యలు కూడా..

ఇలా మీరు మీ ఇంటి మేడ మీద సెల్‌ టవర్‌ ఇన్‌స్టాలేషన్‌కు ఒప్పుకుంటే.. మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. అంతేకాక సదరు కంపెనీ నుంచి రీఛార్జ్‌ సదుపాయాలను కూడా పొందవచ్చు. సాధారణంగా ఇంటి పైకప్పు మీద టవర్‌ను ఏర్పాటు చేస్తే నెలకు కనీసం రూ.20-రూ.25 వేల వరకు అందిస్తారని సమాచారం. అయితే టవర్‌ ఇన్‌స్టాలేషన్‌ వల్ల సంపాదనతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి.

అవేంటంటే.. టెలికాం టవర్లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. దీర్ఘకాలం ఇది మన మీద పడితే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాక రేడియేషన్ నిద్రలో అంతరాయాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. కొంతమందికి రేడియేషన్ వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కనుక అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి.