సోనీ బ్రేవియా టీవీ ఈ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీలో సోనీ అల్ట్రా హెచ్ డీ పిక్చర్ క్వాలిటీ ఆకట్టుకుంటోంది. మనకు హై-డెఫినిషన్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.
వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు ఏర్పాటు చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 4కే హెచ్ డీఆర్, 4కే ఎక్స్ రియాలిటీ ఫ్లో ఈ 55 అంగుళాల టీవీలోని అదనపు ప్రత్యేకతలు. ఈ సోనీ టీవీ రూ. 57,990కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.
హైసెన్స్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూలెడ్ టీవీ డీసీపీఐ-3 వైడ్ కలర్ టెక్నాలజీతో స్పష్టమైన రంగులలో చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. అధునాతన ఆడియో నాణ్యత దీనికి అదనపు ప్రత్యేకత. దీనికి డాల్బీ ఆడియో, 30 డబ్ల్యూ శక్తివంతమైన వాట్ మద్దతు ఉంది. వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా మూడు హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు ఏర్పాటు చేశారు. ఈ టెలివిజన్ 1 బిలియన్ రంగులను కలిగి ఉంది. ఈ హైసెన్స్ టీవీ రూ.రూ. 37,999కు అందుబాటులో ఉంది.
హైయర్ 55 అంగుళాల యూహెచ్డీ స్మార్ట్ గూగుల్ టీవీ 4కే హెచ్డీఆర్ టెక్నాలజీ కారణంగా పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాగా వెలుతురు ఉన్నచోట కూడా కూడా స్పష్టమైన చిత్రాన్ని చూడవచ్చు. ఈ 55 అంగుళాల టీవీలోని 30డబ్ల్యూ ఆడియో అవుట్‌పుట్‌కు డాల్బీ ఆడియో మద్దతు ఉంది. దీని ద్వారా స్పష్టమైన శబ్ధం వినవచ్చు. దీనిలో 5 జీబీ మెమెరీ స్టోరేజీ కెపాసిటీ ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ హైయర్ టీవీ ధర రూ.45,490.
ఎల్జీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలోని 4కె అల్ట్రా హెచ్ డీ టెక్నాలజీ కారణంగా స్క్రీన్‌పై చిత్రం అధిక నాణ్యతతో కనిపిస్తుంది. ఈ టీవీకి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ తదితర వాటితో సహా అపరిమిత ఓటీటీ యాప్ సపోర్ట్ ఉంది. 4కే అప్‌స్కేలర్ మద్దతు కారణంగా పిక్చర్ నాణ్యత పెరుగుతుంది. ఈ 55 అంగుళాల టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీఆర్ 10 మద్దతు ఉంది. వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీవీ ధర రూ.43,990. దీనిలో 1.5 జీబీ రామ్, 8 జీబీ మెమరీ కెపాసిటీ ఉన్నాయి.
సామ్‌సంగ్ 43 అంగుళాల డీ సిరీస్ క్రిస్టల్ 4కే వివిడ్ అల్ట్రా స్మార్ట్ ఎల్ఈడీ టీవీ స్పష్టమైన విజువల్స్ తో నాణ్యమైన పిక్చర్ తో ఆకట్టుకుంటోంది. దీనిలోని 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు కారణంగా లాగ్-ఫ్రీ వీక్షణను అనుమతిస్తుంది. అలాగే మూడు హెచ్డీఎమ్ఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులతో వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. 43 అంగుళాల టీవీలలో ఇది ఉత్తమ టీవీ అని చెప్పవచ్చు. దీనిలోని క్యూ సింఫనీ టెక్నాలజీ కారణంగా ఇన్ బిల్ట్ స్పీకర్లు, సౌండ్‌బార్లను సమర్థంగా పనిచేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ టీవీ రూ.32,990కు అందుబాటులో ఉంది.