చెర్రీ పండ్ల గురించి అందరికీ తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
చెర్రీలు తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
చెర్రీలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. చెర్రీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.
నిద్రలేమి సమస్యలతో బాధ పడేవారు చెర్రీలను రోజూ కాసిన్ని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. చెర్రీ జ్యూస్ తాగినా నిద్ర హాయిగా నిద్రపోవచ్చు. అలాగే వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పులు, వాపులను కూడా తగ్గించడానికి చెర్రీలు హెల్ప్ చేస్తాయి.
చెర్రీల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను వెన్నగా కరిగించేస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
అంతే కాకుండా చెర్రీల్లో ఉండే ఆంథోసైనిన్స్ మెదడు కణాలను.. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. మతి మరుపు, అల్జీమర్స్ సమస్యలు ఏర్పడకుండా చేస్తుంది. వృద్ధాప్యం నుంచి మిమ్మల్ని రక్షించి.. యంగ్‌గా ఉండేలా చేస్తాయి.