ఐఫోన్, ఐప్యాడ్‌లలో భద్రతా లోపాలు.. వెంటనే ఈ పని చేయండి: కేంద్రం హెచ్చరిక

www.mannamweb.com


సెక్యూరిటీలో యాపిల్ కంపెనీని మించింది లేదని చాలా మంది ఐఫోన్, ఐప్యాడ్ లు, మ్యాక్ సిస్టంలు వంటివి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఏ సెక్యూరిటీ చూసి అయితే యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారో.. ఆ సెక్యూరిటీ విషయంలోనే సమస్యలు ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. ఐఫోన్ లు, ఐప్యాడ్ లు వంటి యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతా సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. ఈ కారణంగా నేరగాళ్లు సులువుగా ఐఫోన్, ఐప్యాడ్ వంటి యాపిల్ ఉత్పత్తులను యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది స్పూఫింగ్ కి దారి తీస్తుందని.. యూజర్ల డేటా లీకయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్, యాపిల్ వాచ్, యాపిల్ టీవీ, విజన్ ప్రో వంటి ఉత్పత్తుల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. ఈ డివైజ్ లపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

యాపిల్ సాఫ్ట్ వేర్ లో వివిధ లోపాలు ఉన్నాయని కేంద్ర సంస్థ వెల్లడించింది. అయితే ఈ సమస్యకు సాధ్యమైన పరిష్కారం కూడా వెల్లడించింది. యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతా లోపాల గురించి తాజాగా ప్రకటన వెలువరించింది. సున్నితమైన సమాచారాన్ని స్కామర్లు సులువుగా ఎటాక్ చేస్తారని సెర్ట్ ఇన్ తెలిపింది. అయితే యాపిల్ కంపెనీ తాజా సెక్యూరిటీ అప్డేట్స్ లో ఈ లోపాలను ఫిక్స్ చేసిందని.. కాబట్టి వినియోగదారులు తమ డివైజ్ లను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. అలానే సఫారీ బ్రౌజర్, విజన్ ప్రో, మ్యాక్ బుక్స్, యాపిల్ వాచ్ యూజర్లు కూడా భద్రతా సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉందని.. ఈ డివైజ్ లపై కూడా అటాక్ చేసే అవకాశం ఉందని తెలిపింది. బ్లూటూత్ లో సరికాని ధ్రువీకరణ, మీడియా రిమోట్, ఫోటోస్, సఫారీ, వెబ్ కిట్ కాంపోనెంట్స్ వంటి వాటి వల్ల ఎటాక్ లు జరుగుతాయని వెల్లడించింది. ఎక్స్ టెన్షన్ కిట్, షేర్ షీట్, మెమొరీ కరెప్షన్, లాక్ స్క్రీన్, టైమింగ్ సైడ్ ఛానల్ వంటి వాటిలో కూడా ప్రైవసీ సంబంధిత లోపాలు ఉన్నాయని తెలిపింది.
లోపాలు ఉన్న యాపిల్ ఓఎస్ వెర్షన్లు ఇవే:

17.6కి ముందున్న యాపిల్ ఐఓస్ వెర్షన్లు, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లు
17.6కి ముందు వచ్చిన యాపిల్ సఫారీ వెర్షన్లు
17.6కి ముందు వచ్చిన యాపిల్ టీవీఓఎస్ వెర్షన్లు
16.7.9కి ముందు వచ్చిన యాపిల్ ఐఓఎస్ వెర్షన్లు, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లు
14.6కి ముందు వచ్చిన యాపిల్ ఏసీఓఎస్ సోనోమా వెర్షన్లు
13.6.8కి ముందు వచ్చిన మ్యాక్ ఓఎస్ వెంచురా వెర్షన్లు
12.7.6కి ముందు వచ్చిన మ్యాక్ ఓఎస్ మోంటెరేయ్ వెర్షన్లు
10.6కి ముందు వచ్చిన యాపిల్ వాచ్ ఓఎస్ వెర్షన్లు
1.3కి ముందు వచ్చిన యాపిల్ విజన్ ఓఎస్ వెర్షన్లు

పైన చెప్పిన ఓఎస్ వెర్షన్లలోనే భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని సెర్ట్ ఇన్ తెలిపింది. నేరగాళ్లు సులువుగా ఎటాక్ చేసి డేటాను దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ ని అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది.