ప్రస్తుతం మార్కట్లో ఫ్లిప్ ఫోన్ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఫ్లిప్ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గం హువాయి మార్కెట్లోకి కొత్త ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
హువాయి నోవా ఫ్లిప్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.94 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ ఎల్టీపీఓ ఫోల్డబుల్ డిస్ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను అందించారు. దీంతో సన్‌లైట్‌లోనూ ఈ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్లో రెండు స్క్రీన్ విషయానికొస్తే 215 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీని అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్లో కిరిన్ 8000 చిప్సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను మొత్తం మూడు స్టోరేజ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో.. 256GB, 512GBతో పాటు 1TB స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో కవర్ స్క్రీన్‌పై డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 1/1.56-ఇంచెస్‌తో కూడిన RYYB సెన్సార్, f/1.9 ఎపర్చర్‌తో 50MPతో కూడిన మెయిన్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని అదించారు. ఇక ఈ ఫోన్లో 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు. అలాగే 66 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ను న్యూ గ్రీన్, స్టార్రీ బ్లాక్, జీరో వైట్, సకురా పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు.
ధర విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 62200కాగా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 67,000గా నిర్ణయించారు. ఇక 1 టీబీ వేరియంట్ విషయానికొస్తే రూ. 76,00గా నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు.