దేశంలో ఎంతోమంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని కుట్టు మిషన్ ద్వారా డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే చేతినిండా పని ఉన్నప్పటికీ.. కుట్టు మిషన్ కొనే స్థోమత లేక వేరే షాపులు, కంపెనీల్లో జాబ్ చేస్తుంటారు. దేశంలో చాలా మంది కుట్టు మిషన్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అలాంటి వారి ఆశలు నెరవేర్చడానికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం కొన్ని కండీషన్లు పెట్టింది.. ఆ కండీషన్లు ఏంటీ? కుట్టు మిషన్ ఎలా పొందాలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులను కొనసాగించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలు, పురుషులకు ఉచితంగా కుట్టుమిషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో వివిధ వృత్తుల వారికి కేంద్ర ప్రభత్వం ప్రత్యేక పరికరాుల, యంత్రాలు వివిధ స్కీముల ద్వారా అందిస్తుంది. కేంద్ర ప్రధానమంత్రి ‘విశ్వ కర్మ యోజన పథకం’ ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి రూ.15 వేలు పొందవొచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి జమ అవుతుంది. ఒక వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చెల్లిస్తారు.
కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం లక్ష రూపాయలు ఇస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించవొచ్చు. రుణాన్ని చెల్లించని తర్వాత మీరు రెండు లక్షల వరకు తదుపరి రుణాన్ని తీసుకోవచ్చు. దీన్ని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలా కుట్టు మిషన్ ద్వారా దుఖానం పెట్టుకునేందుకు కేంద్ర రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువ.. రుణాలకు వర్తించే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్ర చెల్లిస్తుంది. ఈ పథకానికి మహిళలే కాదు.. పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హత :
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరి భారత దేశ పౌరుడిగా ఉండాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇప్పటికే కట్టు పని చేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన్ కింద టైలర్ గా పని చేసేవారు ఎవరైనా ఈ పథకానికి అర్హులు.. దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు దారులు 18 సంవత్సరాలు పై బడి ఉండాలి.
కావాల్సిన డాక్యూమెంట్స్ :
ఆధార్ కార్ఢులు, స్థానికంగా ఉంటున్న చిరుణామా ప్రూఫ్, ఏదైనా గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ బుక్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ప్రధాన మంత్రి విశ్వ కర్మ యోజన్ కింద కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేయదల్చిన వారు ముందుగా https://pmvishwakarma.gov.in అధికారిక వెబ్ సైట్ కి వెళ్లండి. ఆల్ లైన్ చేయలేకపోతే మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి చేయవొచ్చు. పైన పేర్కొన్న పత్రాలు మీ వద్ద ఉంచుకోండి. మీ ధరఖాస్తును సమరప్పించిన తర్వాత మీరు రసీదును పొందుతారు. ఆ రసీదు మీ దగ్గరు తప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. కేంద్రం కొన్ని రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేస్తుంది. ఇలా మీరు కొట్టు మిషన్ కొనుగోలు చేయవొచ్చు