బీమాతో జీవితానికి ధీమా.. నయా పాలసీలను ప్రకటించిన ఎల్ఐసీ

www.mannamweb.com


భారతదేశంలో చాలా ఏళ్లుగా బీమా అంటే ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) గుర్తుకు వస్తుంది. ఎల్ఐసీలో పాలసీ ఉంటే జీవితానికి దీమా అనే రేంజ్ ప్రజలు అభిమానాన్ని పొందింది.

అయితే మారుతున్న కాలంతో పాటు ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులకు మేలు చేసేలా వివిధ పాలసీలను ప్రకటిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ బీమా సంస్థల పోటీని తట్టకునేలా కస్టమర్ల ఆదరణను పొందేలా ఎల్ఐసీ తాజాగా రెండు నయా పాలసీలను ప్రకటించింది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇచ్చేలా ఈ పాలసీలను రూపొందించింది. టర్మ్ ఇన్సూరెన్స్, లోన్ రీపేమెంట్‌లకు వ్యతిరేకంగా సేఫ్టీ నెట్‌ను అందించడానికి కొత్త బీమా ప్లాన్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎల్ఐసీ, యువ టర్మ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ఈ పాలసీలు ఆగస్టు 5 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ నయా పాలసీల గురించి వివరాలను తెలుసుకుందాం.

ఎల్ఐసీ యువ టర్మ్ ప్లాన్ కేవలం ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఎల్ఐసీ డిజి టర్మ్ ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులను ఆకర్షించేలా ఈ రెండు పాలసీలను రూపొందించారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ప్రజలు వివిధ అవసరాల కోసం అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. బీమా చేసిన కుటుంబానికి రుణ చెల్లింపులకు వ్యతిరేకంగా భద్రతా వలయాన్ని అందించడానికి గృహ/విద్య/వాహనం వంటి రుణ బాధ్యతలను కవర్ చేయడానికి ఎల్ఐసీ టర్మ్ బీమా పథకాన్ని ప్రారంభించింది. యువ డిజి టర్మ్ అనేది నాన్-పార్, నాన్-లింక్డ్, లైఫ్, ఇండివిజువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది పాలసీ వ్యవధిలో బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో బీమా చేసిన కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది నాన్-పార్ ప్రొడక్ట్, దీని కింద మరణంపై చెల్లించే ప్రయోజనాలు హామీ ఇస్తాయి.

ఎల్ఐసీ యువ టర్మ్ ప్లాన్

ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉంటే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలుగా ఉంది. మెచ్యూరిటీలో కనీస వయస్సు 33 సంవత్సరాలుగా ఉంటే గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలుగా ఉంది. ఈ పాలసీలో కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ. 50,00,000, అలాగే గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం రూ. 5,00,00,000. ఈ పాలసీలో ఆకర్షణీయమైన హై సమ్ అష్యూర్డ్ రిబేట్ ప్రత్యేక ప్రయోజనంగా ఉంటుంది. అలాగే ఈ పాలసీను మహిళలు తీసుకుంటే తక్కువ ప్రీమియం వసూలు చేస్తారు. అలాగే రెగ్యులర్ ప్రీమియం, పరిమిత ప్రీమియం చెల్లింపు కింద లైఫ్ అష్యూర్డ్ మరణంపై చెల్లించాల్సిన మొత్తం వార్షిక ప్రీమియమ్‌కు 7 రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105 శాతాన్ని చెల్లిస్తారు.

ఎల్ఐసీ యువ డిజీ టర్మ్ ప్లాన్

ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్/ డిజీ క్రెడిట్ లైఫ్ నాన్-పార్, నాన్ లింక్డ్, లైఫ్, ఇండివిజువల్, ప్యూర్ రిస్క్ ప్లాన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీను తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉంటే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలుగా ఉంది. ఈ పాలసీలో కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ. 50,00,000, గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం రూ. 5,00,00,000. ఈ పాలసీలో కూడా మహిళల నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.