హాలు అందంగా ఉండాలంటే ఆ హాల్లో ఇలాంటి అందమైన టీవీ యూనిట్ ఉండాలి. కొన్ని ఇళ్లలో కప్ బోర్డులు ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న పెద్ద సైజు టీవీలు సరిపోవు. కాబట్టి సెపరేట్ గా ఒక టీవీ స్టాండ్ కొనుక్కోవాలి. కొంతమంది టేబుల్స్ కొనుక్కుంటారు. కొంతమంది గోడకు తగిలించుకుంటారు. అయితే టీవీ పక్కన డెకరేషన్ వస్తువులు పెట్టుకుంటే ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది అని ఆలోచించేవారు టీవీ యూనిట్ కొనుక్కుంటూ ఉంటారు. మీరు కూడా టీవీ యూనిట్ కొనుక్కోవాలన్న ఆలోచనలో ఉంటే కనుక ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఈ టీవీ యూనిట్ పై ఏకంగా 30 వేలు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు భారీ టీవీ యూనిట్ ని కేవలం 7500 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
ఇంజీనీర్డ్ వుడ్ టీవీ యూనిట్ విత్ డిస్ప్లే క్యాబినెట్ తో వస్తుంది. 5.93 అడుగుల వెడల్పు, 4.85 అడుగుల ఎత్తు పరిమాణంలో వస్తుంది. క్యాబినెట్ 1.5 అడుగుల వెడల్పుతో వస్తుంది. ఇందులో 7 అల్మారాలు ఇచ్చారు. బాగా పైన ఒకటి, టీవీకి కుడి పక్కన రెండు, బాగా కింద మధ్యలో రెండు అల్మారాలు ఇచ్చారు. అలానే రెండు క్లోజ్డ్ అల్మారాలు కూడా ఇచ్చారు. స్టైలిష్ లుక్ తో, మంచి ఫినిషింగ్ తో దీన్ని రూపొందించారు. 15 కంటే ఎక్కువ క్వాలిటీ టెస్టులు చేశారు. చెదపురుగులు పడతాయేమో అన్న టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది చెదపురుగుల రెసిస్టెంట్ తో వస్తుంది. అలానే స్క్రాచ్ రెసిస్టెంట్ తో వస్తుంది. గీతలు పడతాయేమో అన్న బెంగ అవసరం లేదు. ఈ టీవీ యూనిట్ విత్ క్యాబినెట్ లో టేబుల్ క్లాక్, డెకరేషన్ వస్తువులు, పుస్తకాలు వంటివి అలంకరణ కోసం పెట్టుకోవచ్చు.
టీవీ కింద సౌండ్ బార్ పెట్టుకోవడానికి సెపరేట్ గా స్పేస్ ఉంది. దీన్ని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. టీవీని యూనిట్ కి తగిలించుకుంటే శుభ్రం చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. టీవీ, సౌండ్ బార్ వంటివి కనెక్ట్ చేసుకునే వైర్లు కనిపించకుండా యూనిట్ వెనుక ఒక రంధ్రం ఉంది. అందులోంచి వైర్లు లాక్కుని కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని లివింగ్ రూమ్, హోమ్ ఆఫీస్ స్పేస్ లలో అమర్చుకోవచ్చు. దీని బరువు 65 కిలోలు ఉంటుంది. కొన్న తర్వాత నచ్చకపోతే 10 రోజుల్లో వెనక్కి ఇచ్చేయవచ్చు. సేల్ లో భాగంగా ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 37,500 కాగా ఆఫర్ లో రూ. 8,299 పడుతుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద అదనంగా రూ. 829 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు 37 వేల ఈ టీవీ యూనిట్ ని రూ. 7500కే సొంతం చేసుకోవచ్చు.