టీచర్ల ‘పని సర్దుబాటు’ కు సిద్ధం

www.mannamweb.com


టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం పాఠశాలవిద్య ఉన్నతాధికారులు నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. తాజా షెడ్యూలు ప్రకారం మండలాల్లో పాఠశాలల వారీగా మిగులు (సర్‌ప్లస్‌) టీచర్లు, కొరతవున్న పాఠశాలల జాబితాలను శుక్రవారం సంబంధిత ఎంఈవోలకు ఆన్‌లైన్‌ లింక్‌ద్వారా తెలియజేస్తారు. ఆ ప్రకారం కేడర్‌ సీని యార్టీ వివరాలను కూడా పంపిస్తారు. దీనికనుగుణంగా సర్‌ప్లస్‌ జాబి తాల్లో ఆయా సబ్జెక్టుల్లో జూనియర్లను గుర్తించడంతో పాటు, కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి ఖాళీల వివరాలతో ఈ నెల 9న మధ్యాహ్నం ఎంఈవోల లాగిన్‌లకు డేటాను విడుదల చేస్తారు. ఆ మరు సటి రోజే సంబంధిత సర్‌ప్లస్‌ టీచర్లను మండల కేంద్రానికి ఎంఈవోలు పిలిపించి స్థానికంగా సబ్జెక్టుల వారీగా కొరత వున్న పాఠశాలల జాబితాను ప్రదర్శించి వాటిలో వేకెన్సీని ఎంచుకోవడానికి అభీష్టాన్ని తీసుకుంటారు. ఇలా ఎంచుకున్న వేకెన్సీని ఆన్‌లైన్‌ విధానంలోనే అక్కడికక్కడే నమోదు చేస్తారు. సంబందిత వేకెన్సీలో తాత్కాలిక నియామకం కింద ఆన్‌లైన్‌ ఉత్తర్వులను 11వ తేదీలోగా జారీచేస్తారు. ఇలా నియామకపు ఉత్తర్వులు పొందిన టీచర్లంతా 12వ తేదీన నూతన బదిలీస్థానాల్లో విధులు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన జరుగు తుంది. వీరంతా ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసేవరకు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 వరకు తాత్కాలిక స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ నుంచి అంధత్వం వున్న టీచర్లు (విజువల్లీ హ్యాండీ కాప్డ్‌), వచ్చే ఏడాది ఏప్రిల్‌ 31 నాటికి ఉద్యోగవిరమణ చేయనున్న ఉపాధ్యాయులను మినహాయించారు. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పూర్తయిన అనంతరం మండలాల్లో ఇంకా మిగిలివున్న సర్‌ప్లస్‌ టీచర్లను డీవైఈవో పూల్‌కు చేర్చుతారు. సంబందిత డివిజన్‌లో కొరత వున్న పాఠశాలలకు వారిని సర్దుబాటు చేసుకోవచ్చు. అక్కడకూడా మిగిలిపోతే డీఈవో పూల్‌కు చేర్చుతారు. మండలంలో టీచర్ల కొరతవున్న హైస్కూళ్ళకే వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో సర్దుబాటుకు తొలిప్రాధాన్యతనివ్వాలని నిర్దేశించారు. దీనికిగాను ఏ మండలంలోనైనా సబ్జెక్టు టీచర్లు దొరకకపోతే సర్‌ప్లస్‌గా వున్న ఎస్జీటీల పీజీ విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఆయా సబ్జెక్టులకు ఉన్నత పాఠశాలల్లో నియమించేందుకు వెసులుబాటు కల్పించారు.

ఉమ్మడి జిల్లాలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఎలా జరిగే అవకాశం ఉందంటే.. ప్రతీ మండలంలో దాదాపు 30 నుంచి 40 మంది సర్‌ప్లస్‌ టీచర్లుండగా, అక్కడ గరిష్టంగా 16 నుంచి 18 మంది వరకే కొరత వున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే సర్‌ప్లస్‌ టీచర్లంతా ఇంచు మించుగా ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు అవుతారని అంచనా. మొత్తంమీద జీవో 117 ఉత్తర్వుల పేరు ప్రస్తావించక పోయినా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ అంతా ఆ ఉత్తర్వుల మార్గ దర్శకాలు, ఉపా ధ్యాయ, విద్యార్దుల సంఖ్య నిష్పత్తి ప్రకారమే జరుగుతోందని తెలుస్తోంది.