ఎలక్ట్రిక్ స్కూటీల్లో గానీ బైక్స్ లో గానీ రెండు రకాల వాహనాలు ఉన్నాయి. బ్యాటరీ తీసుకునే సదుపాయం ఉన్న వాహనాలు, బ్యాటరీ ఫిక్స్డ్ గా వాహనంలోనే ఉండే రకాలు. బ్యాటరీ ఫిక్స్డ్ గా ఉండడం వల్ల ఛార్జింగ్ బండి ఉన్న చోటునే పెట్టాల్సి ఉంటుంది. అదే రిమూవబుల్ బ్యాటరీ ఫెసిలిటీ ఉంటే బ్యాటరీని ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టవచ్చు. స్వాప్ స్టేషన్స్ లో బ్యాటరీని సులువుగా ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు. మరి అలాంటి వాహనం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. బీగాస్ కంపెనీకి చెందిన సీ12ఐ ఈఎక్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కి.మీ. రేంజ్ ఇస్తుంది. బ్యాటరీలు ఛార్జ్ అవ్వడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీ.గా ఉంది.
ఇందులో 2500 వాట్ మోటార్ ని ఇచ్చారు. ఐపీ67 రేటింగ్ తో ఈ మోటార్ వస్తుంది. ఇక 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా ఐపీ67 రేటింగ్ తో వస్తుంది. బ్యాటరీ మీద 36 వేల కి.మీ. లేదా 3 ఏళ్ల వారంటీ ఇచ్చారు. ఇది డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. బీగాస్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, ఫోలైజ్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్ లో వస్తుంది. దీని అసలు ధర రూ. 1,21,734 కాగా ఆఫర్ లో రూ. 94,412కే అందుబాటులో ఉంది. అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,250 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు లక్ష 22 వేల ఎలక్ట్రిక్ స్కూటీని రూ. 96,162కే సొంతం చేసుకోవచ్చు.
ఈ కంపెనీకి చెందిన స్కూటీల్లోనే 125 కి.మీ. రేంజ్ ఇచ్చే స్కూటీ ఉంది. టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీ.గా ఉంది. ఇందులో 2500 వాట్ మోటార్ ని, 2.7 కిలో వాట్ బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా మూడేళ్లు లేదా 36 వేల కి.మీ. వారంటీతో వస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ కి 4.5 గంటల సమయం పడుతుంది. ఇది ఆల్పైన్ గ్రీన్, బీగాస్ బ్లూ, ఫోలైజ్ గ్రీన్, బ్రూక్లిన్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, ఎల్లో టెక్నో మొత్తం 7 రంగుల్లో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 1,46,429 కాగా ఆఫర్ లో రూ. 1,24,201కే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే కనుక అదనంగా రూ. 2,250 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటీనీ రూ. 1,21,951కే సొంతం చేసుకోవచ్చు.
బీగాస్ సీ12ఐ మ్యాక్స్ డీటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్ తో 135 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 3.2 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీ. ఇచ్చారు. ఇది కూడా 7 రంగుల్లో లభిస్తుంది. ఆల్పైన్ గ్రీన్, బీగాస్ బ్లూ, ఫోలైజ్ గ్రీన్, బ్రూక్లిన్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, ఎల్లో టెక్నో రంగుల్లో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 1,49,190 కాగా ఆఫర్ లో రూ. 1,37,885 పడుతుంది. అయితే మీరు ఈ బండిని ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే కనుక రూ. 2,250 తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్కూటర్ ని రూ. 1,35,860కే సొంతం చేసుకోవచ్చు.