నేటికాలంలో మొబైల్స్ వినియోగం బాగా పెరిగింది. దాదాపు ఎవరి చేతిలో చూసిన ఫోన్ కనిపిస్తునే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. రోజులో అధిక సమయంలో ఫోన్ తోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఛార్జీంగ్ సమస్య అనేది వస్తుంది. గంటల తరబడి ఫోన్ వాడటం వలన త్వరగా ఛార్జీంగ్ అయిపోతుంది. ఇదే సమయంలో తిరిగి ఛార్జీంగ్ పెడితే..పుల్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. త్వరగా ఛార్జీంగ్ ఎక్కితే బాగుండని చాలా మంది భావిస్తారు. ఇలా ఫోన్లు వినియోగించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది.
ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వాడకం కారణంగా వాటిల్లోని ఛార్జీంగ్ త్వరగా తగ్గిపోతుంది. ఫుల్ ఛార్జీంగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా ఫుల్ ఛార్జింగ్ పెడితే.. ఎక్కువగా వినియోగిస్తుండటం వలన మధ్యాహ్నానికి మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని రియల్ మీ కంపెనీ తీసుకొచ్చింది. సరికొత్త బ్యాటరీ, సరికొత్త ఛార్జర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.
ప్రస్తుతం 80డబ్ల్యూ, 120డబ్ల్యూ, 210 డబ్ల్యూ ఛార్జింగ్ సామర్థ్యం ఛార్జర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా రియల్ మీ కంపెనీ.. 300వాట్స్ కెపాసిటీతో కొత్త ఛార్జర్లు తీసుకురాబోతున్నది. అంతేకాక దానికి తగినట్లు త్వరలో రియల్ మీ జీటీ-7 ప్రో అనే స్మార్ట్ ఫోన్ లో 5.000ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకురానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 5 అంటే ఐదు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. జీరో నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కేందుకు మూడు నిమిషాల టైం తీసుకుంటుంది. అలానే మిగతా 50 శాతం ఛార్జింగ్ కోసం కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. అంటే మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.
ఈ విషయాన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్ కంపెనీ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్రాన్సింగ్ వాంగ్ అధికారింగా వెల్లడించారు. అదేవిధంగా రియల్ మీ జీటీ-7 ప్రో స్మార్ట్ ఫోన్లను 2024 చివర్లో మార్కెట్ లోకి విడుదల చేస్తామని, వాటికి ఈ బ్యాటరీ, ఛార్జర్లు ఉంటాయని వెల్లడించారు. మొత్తంగా కొత్త ఛార్జింగ్, బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న స్మార్ట్ ఫోన్లతో.. జనానికి ఛార్జింగ్ సమస్యలు తప్పుతాయని, రాత్రంతా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదని పలువురు చెబుతున్నారు.