ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా ఎన్నికలు, 40,150స్కూళ్లలో కమిటీల ఎన్నికలు పూర్తి

www.mannamweb.com


SMC Eelections: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం ఏపీలోని 24 జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఏఎస్ఆర్, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులుతెలిపారు.

రాష్ట్రంలో 24 జిల్లాల్లోని 40,781 పాఠశాలలకు గాను 40150 (98.45%) పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. 631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా వేశారు. ఎన్నికల నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.

అనంతపురంలో 1741 స్కూళ్లలో 1712 స్కూళ్లలో స్కూల్‌ మేనేజ్‌మెంట్ కమిటీలను ఎన్నుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 2183లో 2159, బాపట్లలో 1433లో 1429, చిత్తూరులో 2458లో 2451, తూర్పుగోదావరిలో 989లో 968, ఏలూరులో 1846లో 1833, గుంటూరులో 1062లో 1053, కడపలో 2051లో 1999, కాకినాడలో 1281లో 1272, కోనసీమలో 1582లో 1581 స్కూళ్లలో ఎన్నికలు జరిగాయి.

కృష్ణాజిల్లాలో 1363లో 1360, కర్నూలులో 1456 స్కూళ్లలో 1379, మన్యం జిల్లాలోని 1598 స్కూళ్లలో 1580, నంద్యాలలో 1400లో 1383, నెల్లూరులో 2611లో 2584స్కూళ్ళలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 941లో 908, పల్నాడు జిల్లాలో 1583లో 1560, ప్రకాశంలో 2405లో 2312, శ్రీసత్యసాయిలో 2065లో 2053లో ఎన్నికలు జరిగాయి.

శ్రీకాకుళంలో 2643లో 2560 స్కూళ్లలో, తిరుపతిలో 2322లో 2305 స్కూల్లు, విశాఖపట్నం 596 స్కూళ్లలో 587, విజయనగరంలో 1795లో 1748, పశ్చిమ గోదావరిలో 1377లో 1374 స్కూళ్లలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 40781 స్కూళ్లలో 40150 స్కూళ్లలో ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 631 స్కూళ్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 93స్కూళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యాబోధన, ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు పర్యవేక్షిస్తాయి.