స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం.. ఆ విషయాల్లో మనమే నెంబర్ వన్

www.mannamweb.com


దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊరూవాడా తిరంగా జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది.

అదే సంవత్సరం ఆగస్టు 15 నుంచి దేశ అధికారిక జెండాగా మారింది. సుమారు 200 ఏళ్ల పాటు బ్రిటీష్ పాలనలో అనేక కష్టాలు చూసిన మనం 1947 ఆగస్టు 15 నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చగలుతున్నాం. దీని వెనుక అనేక మంది మహానుభావుల త్యాగాలు దాగున్నాయి. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో మన దేశంలోని విశేషాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

నీటిలో తేలియాడే పోస్టాఫీసు

ప్రపంచంలో అతి పెద్ద పోస్టల్ నెట్ వర్క్ మన దేశంలోనే ఉంది. ఇక్కడ దాదాపు 1,55,015 పోస్టాఫీసులున్నాయి. ఒక్కొక్క పోస్టాఫీసు దాదాపు 7,715 మంది ప్రజలకు సేవలందిస్తోంది. వీటిలో శ్రీనగర్ లోని దాల్ సరస్సులో నీటిపై తేలియాడే పోస్టాఫీసు ముఖ్యమైంది. దీన్ని 2011 ఆగస్టులో ప్రారంభించారు.

కుంభమేళా

దేశంలో జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కోట్ల మంది భక్తులు ఈ కార్యక్రమానికి తరలివస్తారు. 2011లో జరిగిన కుంభమేళాకు 75 మిలియన్ల మంది భక్తలు తరలివచ్చారు. అంతరిక్షం నుంచి కూడా కుంభమేళాకి వచ్చిన భక్తుల సముదాయం కనిపించడం విశేషం.

అత్యధిక వర్షపాతం

ప్రపంచంలో అత్యధికంగా సగటు వర్షపాతం మనదేశంలోనే నమోదవుతుంది. మేఘాలయలోని ఖాసీ కొండలపై ఉన్న మాసిన్‌రామ్ అనే గ్రామంలో ఇలా వర్షం కురుస్తుంది. మేఘాలయలో భాగమైన చిర్రపుంజీ లో 1861వ సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఎత్తయిన క్రికెట్ మైదానం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానం మన దేశంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ క్రికెట్ మైదానాన్ని2,444 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. చైల్ సైనిక పాఠశాలలో 1893 సంవత్సరంలో దీన్ని నిర్మించారు.

షాంపూ

తొలిసారిగా మూలికలతో షాంపూ తయారు చేసిన ఘనత మనదేశానిదే. అంటే షాంపు మన దేశంలోనే తయారైంది. దీనితో పాటు షాంపూ అనే పదం సంస్కృతంలోని చంపు నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటంటే సందేశం ఇవ్వడం.

సైకిల్ పై రాకెట్ రవాణా

అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ ను సైకిల్ పై రవాణా చేసిన ఘనత మనదే. ఇస్రో తన మొదటి రాకెట్ ను 1963లో ఆధునిక త్రివేంద్రం శివార్లలోని తుంబలోని చర్చి నుంచి ప్రయోగించింది. ఆ సమయంలో రాకెట్‌ను సైకిల్‌పై అక్కడకు రవాణా చేశారు. ఆ లాంచింగ్ ప్యాడ్ తరువాత కాలంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ)గా పిలిచారు.

చంద్రుడిపై నీటి గుర్తింపు

చంద్రుడిపై నీరు ఉందని మనమే కనుగొన్నాం. ఇస్రో 2009లో చేసిన చంద్రయాన్ ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి భారతదేశం చెప్పింది.