0 రిస్క్​తో అధిక వడ్డీ.. మీ ఇన్​వెస్ట్​మెంట్స్​కి ఈ ఆప్షన్స్​ బెస్ట్

www.mannamweb.com


0 రిస్క్​తో మంచి వడ్డీని సంపాదించే ఇన్​వెస్ట్​మెంట్​ ప్లాన్స్​ గురించి చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పలు బ్యాంక్​లలో ఎఫ్​డీలపై అత్యధిక వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
టీవీఎస్ స్పోర్ట్

ఇన్​వెస్ట్​మెంట్స్​లో ఎంత రిస్క్​ తీసుకుంటే అంత ఎక్కువ సంపాదిచొచ్చు. కానీ అదే సమయంలో చాలా డబ్బులు పొగొట్టుకోవచ్చు. ఇవన్నీ అనవసరం, ప్రశాంతంగా ఉండాలనుకునే వారు జీరో రిస్క్​ ఇన్​వెస్ట్​మెంట్స్​ గురించి వెతుకుతుంటారు. వారిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ఇటీవలి కాలంలో పలు బ్యాంక్​లు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​​డీ) అత్యధిక వడ్డీని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్​, ప్రభుత్వ బ్యాంకుల్లో 3 సంవత్సరాల ఎఫ్​డీలపై లభిస్తున్న అధిక వడ్డీలను ఇక్కడ తెలుసుకోండి.

3ఏళ్ల కాల వ్యవధి ఉండే ఎఫ్​డీలపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు..

1, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్: దేశంలో అతిపెద్ద ప్రైవేట్​ బ్యాంక్​గా పేరున్న హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 3 సంవత్సరాల కాలపరిమితి డిపాజిట్లపై 7 శాతం వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదే కాలపరిమితి డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 4 సంవత్సరాల 7 నెలల కాలపరిమితి ఉన్నప్పుడు సంవత్సరానికి గరిష్టంగా 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేట్లు 2024 జూలై 24 నుంచి అమల్లోకి వచ్చాయి.

2. ఐసీఐసీఐ బ్యాంక్: ఐసీఐసీఐ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్​డ్​ డిపాజిట్ (ఎఫ్​డీ)పై డిపాజిటర్లకు ఏడాదికి 7 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

15 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేట్లు 2024 ఆగస్టు 10 నుంచి అమల్లోకి వచ్చాయి.

3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మూడేళ్ల కాలపరిమితి కలిగి ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదే కాలపరిమితి డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి 2-3 సంవత్సరాల మధ్య ఉంటే, వడ్డీ సంవత్సరానికి 7 శాతం. ఈ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు:
బ్యాంక్​ పేరు వడ్డీలు (%) సీనియర్​ సిటీజెన్​లకు (%)

4. బ్యాంక్ ఆఫ్ బరోడా: మూడేళ్ల కాలపరిమితి ఎఫ్​డీపై బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిటర్లకు 7.15 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఈ డిపాజిట్లపై 7.65 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 2024 జులై 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

5. కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ 3 సంవత్సరాల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్లు అంటే 7.6 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 390, 391 రోజుల టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేట్లు 2024 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
(గమనిక :- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనన్షియల్​ అడ్వాజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)