మతిపోయే ఫీచర్లతో మోటో ఫోన్ లాంచ్.. ఫీచర్లు ఏంటంటే.

www.mannamweb.com


భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అధికంగా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడడానికి ఇష్టపడుతున్నారు. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి.

ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే వీటి క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు భారతదేశంలో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ మోటోరోలా ‘జీ-సిరీస్’ను విస్తరిస్తూ నయా 5 జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో జీ 45 5జీ పేరుతో ఆగస్టు 21న భారతదేశంలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోటో జీ 45 5జీ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలను తెలుసుకుందాం.

మోటో జీ 45 5 జీ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 ఎస్ జెన్ 3 ఎస్ఓసీ ఆధారంగా పని చేసింది. ఈ ఫోన్ ఇతర మోటోరోలా ఫోన్స్‌తో పోలిస్తే వేగవంతమైన 5జీ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మోటరోలా జీ 45 5జీ బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అన్ని మోడళ్లకు వెనుక భాగంలో వేగన్ లెదర్ ముగింపుతో మూడు రంగులలో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.5 అంగుళాల 120 హెచ్‌జెడ్ స్క్రీన్, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని మోటరోలా ధృవీకరించింది.

మోటోలరోలా జీ 45 5 జీ ఫోన్ 50 ఎంపీ క్వాడ్ పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8 జీబీ + 128 జీబీ నిల్వతో వస్తుంది. అయితే ఈ ఫోన్‌లోని చాలా స్పెసిఫికేషన్‌లు ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ చేసిన మోటో జీ 34 5జీ మాదిరిగా ఉన్నాయి. అందువల్ల ధర కూడా మోటో జీ 34 ధరకు దగ్గరగా ఉండవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్ అధికారికంగా ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.