ఈ రెండింటితో హెయిర్‌ప్యాక్ వేస్తే జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది

www.mannamweb.com


ఆడవారికి జుట్టు ఎంత పొడుగ్గా ఉంటే అంత అందం. ఈ మధ్యకాలంలో చాలా మంది మగవారు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే, నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలడం, పలచగా అవ్వడం వంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాంటి ఓ పవర్‌ఫుల్ టిప్ గురించి తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..
2 స్పూన్ల మెంతులు
2 ఉల్లిపాయలు
ఎసెన్షియల్ ఆయిల్ (ఆప్షనల్)
ఏం చేయాలి..
ముందురోజు రాత్రి మెంతులని నీటిలో నానబెట్టండి. తర్వాతి రోజు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టి రసం తీయండి. ఇప్పుడు మెంతులని కూడా మిక్సీ పట్టి ఉల్లిపాయ రసాన్ని అందులో కలపండి.
హెయిర్ ప్యాక్..
ఇలా తయారైన హెయిర్ ప్యాక్‌ని జుట్టు కుదుళ్ళ నుంచి చివరవరకూ అప్లై చేసి గంటపాటు ఉండండి. ప్యాక్ ఆరిపోయాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఉల్లిపాయ వాసన వస్తుంది కాబట్టి, ప్యాక్‌లో ఏదైనా ఓ ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపొచ్చు. దీని వల్ల వాసన రాదు. ఈ ప్యాక్‌తో జుట్టు రాలడం తగ్గుతుంది. వాసన కూడా రాదు.
ఎన్నిసార్లు..
ఈ హెయిర్‌ప్యాక్‌ని వారానికి ఓ సారి పెట్టుకోండి. లేదంటే నెలకి కనీసం రెండుసార్లైనా వాడండి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది.
హెయిర్‌ప్యాక్‌లోని పోషకాలు..
ఈ హెయిర్‌ప్యాక్‌లో సల్ఫర్, విటమిన్ ఎ, సి, కె, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని బలంగా చేస్తాయి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.