మంకీ పాక్స్‌పై ప్రధాని మోదీ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

www.mannamweb.com


మంకీ పాక్స్‌పై WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అలర్టయ్యారు. మంకీపాక్స్‌ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలను అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 15,600 మంకీ పాక్స్‌ కేసులు నమోదవ్వగా 537 మంది మృతి చెందారు. అయితే భారత్‌లో ప్రస్తుతానికి ఎంపాక్స్‌ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ WHO సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది.

మరోవైపు, మంకీ పాక్స్ వ్యాప్తి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల సంసిద్ధతపై పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యం, హోం, విపత్తు నిర్వహణ, ఆరోగ్య పరిశోధనల కార్యదర్శులతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోంది. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా ఈ వ్యాధి మారింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలుస్తోంది.

తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్‌ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది . ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్‌ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.