పొట్టకు, తలనొప్పికి మధ్య సంబంధం ఏంటి.? గ్యాస్ట్రిక్‌ తలనొప్పికి కారణాలివే

www.mannamweb.com


తలనొప్పి.. సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది తలనొప్పితో ఇబ్బంది పడే ఉంటాం. అయితే తలనొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వీటిలో సైనస్‌, ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, జలుబు వల్ల వచ్చే తలనొప్పి ఇలా రకరకాలుగా ఉంటాయి.

అయితే గ్యాస్ట్రిక్‌ తలనొప్పి కూడా ఉంటుందని మీకు తెలుసా.? కడుపులో ఏర్పడే సమస్య కారణంగా తలనొప్పి వస్తుందనే విషయం తెలిసిందే. దీనినే గ్యాస్ట్రిక్‌ తలనొప్పిగా చెబుతుంటారు. ఇంతకీ సమస్య ఎందుకు వస్తుంది.? దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ట్రిక్‌ తలనొప్పి అనేది పొట్టకు సంబంధించిన సమస్. కడుపులో గ్యాస్‌ ఏర్పడడం వల్ల ఈ సమస్య వస్తుంది. కడుపులో ఏర్పడ్డ గ్యాస్‌ క్రమంగా తలకు పాకుతుంది. దీంతో ఇది తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్య రావడానికి జీర్ణ సంబంధిత సమస్య ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అజీర్ణం, జీర్ణశక్తి తక్కువగా ఉండటం, పొట్ట, పేగులకు సంబంధించిన సమస్యల వల్ల ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ట్రిక్‌ తలనొప్పి సమస్య వల్ల కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా.. వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ ఏర్పడటం, అజీర్ణం, పొట్టలో ఆమ్లం అన్నవాహికలోకి రావడం, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయి. గ్యాస్ట్రిక్‌ తలనొప్పి రావడానికి పాచిపోయిన ఆహారం తినడం, పరిమితికి మించి భోజనం చేయడం, మసాలా ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు తాగడకపోవడం, గర్భంతో ఉన్నప్పుడు హార్మోన్ల ఇన్‌ బ్యాలెన్స్‌ వంటివి ప్రధాన కారణాలు చెప్పొచ్చు. ఈ సమస్య నుంచి బయటడడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

మిరియాలతో చేసి టీ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఉదయం పూట తులసి ఆకులు నమలడం వల్ల గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇక గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య దూరమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇక భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకోవడం, మజ్జిగ తాగడం లాంటివి కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతాయి. మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంతోపాటు, సమయానికి భోజనం చేస్తే గ్యాస్ట్రిక్‌ తలనొప్పి సమస్య పరార్‌ అవుతుంది.