లెనోవో ఐడియల్ ప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్‌టాప్ పవర్, పోర్టబిలిటీ అవసరమయ్యే గేమర్‌లకు కచ్చితంగా సరిపోతుంది. ఏఎండీ రైజెన్ 5 5500హెచ్ ప్రాసెసర్, నివిడా ఆర్‌టీఎక్స్ 2050 జీపీయూ గ్రాఫిక్ కార్డ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 15.6 ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది.
మంచి టైపింగ్ కోసం ట్రై స్ట్రైక్ కీ బోర్డ్‌తో 6.5 గంటల బ్యాటరీ లైఫ్ అందించే ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుత సేల్‌లో 42 శాతం తగ్గింపుతో ధరరూ. 44,390కు అందుబాటులో ఉంది.
అమెజాన్ సేల్‌లో 36 శాతం తగ్గింపుతో ఆసస్ ఎఫ్ 17 టీయూఎఫ్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. 11వ జెనెరేషన్ ఐ5 ప్రాసెసర్, ఆర్‌టీఎక్స్ 2050 జీపీయూ గ్రాఫిక్‌కార్డుతో 17 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా సున్నితమైన పనితీరు ఆకట్టుకుంటుంది. 16 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్ ధర రూ.48,990గా ఉంది.
ఏసర్ ఆస్సైర్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్ 13వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ + 512జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ల్యాప్‌టాప్ నివిడా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ గ్రాఫిక్ కార్డుతో అందుబాటులో ఉంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ట్విన్ ఎయిర్ కూలింగ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఏసర్ ఆస్పైర్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ. 49,990గా ఉంది.
హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ మిడ్-మాన్‌సూన్ అమెజాన్ సేల్‌లో 25 తగ్గింపుతో అందుబాటులో ఉంది. హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌తో ఎపిక్ గేమింగ్ కోసం అందుబాటులో ఉంది. సిక్స్ కోర్ ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్ ఆధారంగా పని చేసే ఈ ల్యాప్ టాప్ 8 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.47,900.
జిబ్రానిక్స్ ల్యాప్‌టాప్ ఈ సేల్‌లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఐ5 ప్రాసెసర్‌తో పాటు 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఆకట్టుకుంటాయి. 16 జీబీ 512జీబీ వేరియంట్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 31,990గా ఉంది.