TVS Jupiter : అతి త్వరలో టీవీఎస్ జూపిటర్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. టీవీఎస్ జూపిటర్‌ను అప్‌డేట్ చేసి కొత్తగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో విడుదల చేసే టీవీఎస్ జూపిటర్ 110 ఫీచర్లు ఎలా ఉంటాయో, ధర ఎంతో చూద్దాం..
టీవీఎస్ మోటార్ భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఫీచర్లతో వివిధ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుంది. టీవీఎస్‌కు కొనుగోలుదారులు సైతం అధిక సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ కొత్తగా అప్‌డేట్ చేసిన జూపిటర్ 110 స్కూటర్‌ను పరిచయం చేయడానికి ఆగస్టు 22 తేదీని నిర్ణయించినట్లు సమాచారం. ఈ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని టీజర్‌లను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా కొనుగోలుదారులలో ఆసక్తి పెరుగుతోంది.
టీవీఎస్ విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌లో కొత్త స్కూటర్ ముందు భాగంలో LED DRLలతో పాటు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌ను పొందినట్లు చూడవచ్చు. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ కొనుగోలుదారులను ఆకర్షించడానికి వినూత్న డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌లోని పవర్‌ట్రెయిన్‌ను మార్చబోరు. ఇందులో 109.7 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. 77,000 ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చని అంచనా. అయితే కంపెనీ నుండి అధికారిక వివరాలు రావాల్సి ఉంది.
కొత్త TVS జూపిటర్ 110 స్కూటర్ రైడర్‌కు గరిష్ట రక్షణను అందించేలా రూపొందించారు. ఇది భద్రత కోసం డిస్క్, డ్రమ్ బ్రేక్ కలిగి ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక (అరుదైన) మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
సరికొత్త TVS జూపిటర్ 110 స్కూటర్ అధునాతన ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ఎల్‌ఈడీ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే, నావిగేషన్, మొబైల్ ఫోన్ ఛార్జర్ లభిస్తాయని అంటున్నారు. బూట్ స్పేస్‌లో ఫ్యూయల్ ట్యాంక్, రెండు హెల్మెట్‌లను ఉంచడానికి ఫ్లోర్‌బోర్డ్‌ను సెటప్ చేసినట్టుగా చెబుతున్నారు.
ప్రస్తుతం టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,709 నుంచి రూ.1.09 లక్షల వరకు ఉంది. ఇది 124.8 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 8.2 PS గరిష్ట శక్తిని, 10.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 57.27 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇది LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.