ఉలవలతో ఉండే బెనిఫిట్స్ తెలిస్తే.. దిమ్మతిరగాల్సిందే.

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో ఉలవల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఉలవల గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఉలవల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

ఉలవ చారు – బిర్యానీ కాంబినేషన్ గురించి వినే ఉంటారు. ఉలవలతో చేసే వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉలవ చారును ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలి పెట్టరు. రుచితో పాటు ఇందులో పోషకాలు కూడా ఎక్కువే. ఉలవలు తింటే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉలవలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉలవలు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను సైతం తగ్గించుకోవచ్చు. వీటితో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉలవల్లో ఉండే పోషకాలు:

ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ హైపర్ కొలెస్ట్రాలెమిక్ వంటి గుణాలు ఉన్నాయి.

షుగర్ కంట్రోల్:

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉలవలు వీరికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తక్కువగా ఉంటాయి.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది:

ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొవ్వులు పెరిగేలా చేస్తాయి. బాడీలో కొవ్వు విపరీతంగా పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గితే.. గుండె కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది.

ఎముకలు బలంగా ఉంటాయి:

తరచుగా ఉలవలు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా, దృఢంగా ఉంటాయి. కీల్ల నొప్పులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇస్తే.. భవిష్యత్తులో వారికి ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. గాయాలు కూడా త్వరగా మానతాయి.

నెలసరి సమస్యలు మాయం:

మహిళలు తరచుగా ఉలవలను ఆహారం తీసుకుంటూ ఉంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి, నడుము నొప్పి, చికాకు కలగకుండా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)