ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్‌ ఎలా ఎదుగుతాడు? 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు

www.mannamweb.com


పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం.. తమిళుల విజయ కూటమి. జెండా నిండా మెరూన్ కలర్‌ అండ్ పసుప్పచ్చ.. పోరాడే తత్వానికి సింబల్‌గా రెండు ఏనుగులు, మధ్య వాగై పుష్పం.

ఈ పువ్వును విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రవిడులు. ఇదీ క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక. చూడ్డానికి స్పెయిన్ వాళ్ల జాతీయ జెండాలా ఉందంటూ సోషల్ మీడియాలో అప్పుడే విమర్శలొస్తున్నాయి. జెండా సంగతి అటుంచితే.. మన తమన్ సంగీతమందించిన జెండా పాట మాత్రం అదుర్స్ అంటున్నారు. పుట్టుకతో అందరూ సమానమే అనేది విజయ్ పెట్టిన కొత్త పార్టీ సైద్ధాంతిక నినాదం.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చెయ్యబోతోంది హీరో విజయ్ పార్టీ. ఫస్ట్‌ టైమ్ ఓటర్లే నా టార్గెట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే యువతకు ప్రోత్సాహకాలిస్తూ వాళ్ల మనసుల్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మన మొదటి రాష్ట్ర మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని చెప్పారు విజయ్. విజయ్‌కున్న బ్యాక్‌గ్రౌండ్‌కీ.. తమిళనాడు రాజకీయాలకు ఉన్న లంకె మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

తమిళనాట గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత.. అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగని.. వాళ్లంతా పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతారనే సిద్ధాంతం లేదు కూడా. శివాజీ గణేషన్‌, విజయ్ కాంత్‌, శరత్‌ కుమార్‌ తమిళనాడు ప్రజా జీవితంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ లాంటి వాళ్లైతే రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దాల తరబడి డైలమాలో ఉండి.. చివరాఖరుకు వెనకడుగు వేశారు. లోకనాయకుడు కమల్‌హాసన్ ఇప్పటికీ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.

ఒకవైపు ఎంజీఆర్‌, మరోవైపు అన్నాదురై షాడోలు.. మధ్యలో విజయ్‌ బొమ్మ.. పాటలోని ఈ పిక్‌ మాత్రం మాస్‌ జనాల్లో బాగా వైరల్ అవుతోంది. విజయ్‌కి అన్నాడిఎంకె బ్యాకింగ్ ఉండబోతోందా.. జయలలిత తర్వాత జీరో సైజుకు చేరిన అన్నాడీఎంకే పార్టీనే విజయ్ తన పొలిటికల్ కెరీర్‌కి ఆసరాగా వాడుకోబోతున్నారా అనే చర్చ మొదలైంది. తమిళనాడులోనే కాదు, ప్యాన్‌ ఇండియా రేంజ్లో మార్కెట్‌ ఉన్న హీరో దళపతి విజయ్‌.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దళపతిగా పిల్చుకునే అభిమానులు.. విజయ్‌ను ఇళయ దళపతి అంటే.. యువ దళపతి అని పిల్చుకుంటారు. యూత్‌లో ఆ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకున్నారు హీరో విజయ్. ఆయన లు తమిళనాడులో రిలీజ్‌ కాని రోజుల్లో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిమరీ చూసేంత పాషన్ ఉంది అభిమానులకు. విజిల్, మెర్సల్ లాంటి లతో యువ ఆడియన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారారు. ఇప్పుడు వెంకట్‌ ప్రభు డైరక్షన్‌లో గోట్‌ అనే భారీ చేస్తున్న విజయ్.. ఇంకొక్క మాత్రమే చేస్తానని చెప్పేశారు.