కాదేది మోసానికి అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల అత్యాశను లేదా భయాన్ని ఆసరగా చేసుకొని మోసాలకు పాల్పడుతునన్నారు. నిండా ముంచేస్తున్నారు.
మనకు తెలియకుండా మోసాలు జరిగేవి కొన్ని అయితే, భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. ఇంతకీ ఈ మోసం ఎలా జరుగుతోంది.? వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల కొందరు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చాయని. ట్యాక్స్ చెల్లించని నేపథ్యంలో జరిమాన చెల్లించాలని ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. అంత పెనాల్టి చెల్లించకపోతే ఎంతో కొంత చెల్లించమని, తాము మేనేజ్ చేస్తామని నమ్మిస్తున్నారు. దీంతో కొందరు భయపడి వెనకాముందు ఆలోచించుండా డబ్బులు చెల్లిస్తున్నారు. తీరా తాము మోసపోయాని తెలిసి తలలు పట్టుకుంటున్నారు.
ఎలా బయట పడాలి.?
ఈ మోసాల నుంచి బయటపడాలంటే ముందుగా మనకు వచ్చిన నోటీసులు అసలివేనా.? ఫేక్ డ్యాకుమెంట్సా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం ఓ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్‌సైట్‌లో మీకు వచ్చిన డాక్యుమెంట్ సరైందా కాదా.? అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* ముందుగా ఇన్‌కమ్‌ట్యాక్స్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం ‘అథెంటికేట్ నోటీస్/ఆర్డర్ ఇష్యూడ్ బై ఐటీడీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం వచ్చే సెకండ్ ఆప్షన్.. ‘డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత మీకు వచ్చిన నోటీసులో ఉన్న ఐడెంటిఫికేషన్ నెంబర్‌తో పాటు మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
* వెంటనే మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఒకవేళ అందులో సేమ్ మీకు వచ్చిన డాక్యుమెంట్ కనిపిస్తే మీకు నోటీసులు వచ్చింది నిజమే. ఒకవేళ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తే మీకు వచ్చింది ఫేక్ డాక్యుమెంట్ అని అర్థం.