సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్?.. కారణం అదే.. వైరల్ అవుతున్న ఫోటో

www.mannamweb.com


 

ఈ సంక్రాంతి పండుగ వేళ ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొంది. ఈసారి పండుగ బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్ ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.
నేడు ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’​ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో యంగ్ హీరో తేజ సజ్జా పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలలో హనుమాన్ సినిమాదే పై చేయి అంటున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది.

మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్?

‘హనుమాన్’ స్పీడ్ పెరగడంతో ‘గుంటూరు కారం’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మహేష్ సొంత మల్టీఫ్లెక్స్ AMB సినిమాస్‌(గచ్చిబౌలి)లో మొదటిరోజే ‘గుంటూరు కారం’ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్‌ లో పెద్ద దెబ్బ తగిలిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీని గురించి మల్టిఫ్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘గుంటూరు కారం’ జోరు తగ్గడంతో, హనుమాన్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 1 గంటకు కూడా స్లాట్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.