ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు ఆదరణ పెరుగుతున్నది. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సంస్థలు అడ్వాన్డ్స్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. హెల్త్ ట్రాక్, ఫిట్ నెస్, ఇలా పలు క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటున్నారా? అయితే రెడ్ మీ నుంచి న్యూ స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ వాచ్ భారత్‌లో లాంచ్ అయింది. సింగిల్ చార్జ్ తో 18 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.
రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ వాచ్ 2 అంగుళాల ఎల్ సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ 140 స్పోర్ట్స్ మోడ్స్, 200 వాచ్ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. ఐపీఎక్స్ 8 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ స్మార్ట్‌వాచ్ షియోమీ హైపర్ ఓఎస్ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇన్‌బిల్ట్ వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెంట్ అలెక్సాను కలిగి ఉంటుంది. ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్ రేట్, ఎస్ పీఓటు స్థాయి, సహా స్లీపింగ్ ట్రాక్ కలిగి ఉంది. మహిళల్లో రుతుక్రమాన్ని గురించిన సమాచారం అందిస్తుంది. ఎంఐ ఫిట్‌నెస్ యాప్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ 5.3 ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా నేరుగా వాచ్ నుంచే కాలింగ్ చేయడం సహా ఇన్‌కమింగ్ కాల్స్‌కు స్పందించవచ్చు. ఈ వాచ్ ఈఎన్సీ (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌తో కూడిన మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఈ రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ 470ఎంఏహేచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 రోజులపాటు వినియోగించుకోవచ్చు. రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2799 గా ఉంది. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.