మీరు ఎంతో ఇష్టంగా, ప్రేమగా నిర్మించుకున్న ఇంటికి మరింత అందం రావాలంటే దానిలో టీవీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. మీ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక ఫీచర్లతో పాటు స్లైలిష్ లుక్ తో ఆకట్టుకోవాలి.
లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ధర కూడా అందుబాటులో ఉండాలి. ఇన్ని ప్రయోజనాలున్న టీవీలు అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. వివిధ కంపెనీల ఎల్ఈడీ టీవీలపై దాదాపు 60 శాతం వరకూ ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు. కొత్త టీవీని కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఇక్కడ టీవీలను కొనుగోలు చేయడం ద్వారా డబ్బును ఆదా చేయడంతో పాటు మంచి నాణ్యత కలిగిన టీవీలను పొందే అవకాశం లభిస్తుంది. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎల్ఈడీల టీవీలు ఇవే..
ఎల్ జీ (43 అంగుళాలు) స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఈ ఎల్ జీ టీవీలోని మెరుగైన రిజల్యూషన్, రిఫ్రెష్ రేటు కారణంగా పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 43 అంగుళాల టీవీలో లు, వెబ్ సిరీస్, ఇతర కార్యక్రమాలను చక్కగా ఆస్వాదించవచ్చు. దీనిలో అంతర్నిర్మిత వైఫై, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్ట్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ కన్సోల్, బ్లూ-రే ప్లేయర్, యూఎస్ బీ పరికరాలను చాలా సులువుగా ప్లగ్ చేసుకోవచ్చు. ఏఐ సౌండ్ టెక్నాలజీ, 20 వాట్ల అవుట్‌పుట్, వర్చువల్ సరౌండ్ 5.1తో మంచి ఆడియో లభిస్తుంది. ఆపిల్ ఎయిర్ ప్లే2, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తదితర ప్రధాన ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. 4.1 స్టార్ రేటింగ్ పొందిన ఈ ఎల్ఈటీ టీవీపై అమెజాన్ సేల్ లో 38 శాతం తగ్గింపు ఇస్తున్నారు. కేవలం రూ.30,990కు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
సామ్సంగ్ (55 అంగుళాలు) అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ
ప్రముఖ కంపెనీ సామ్సంగ్ నుంచి విడుదలైన ఈ టీవీలోని 4కె క్రిస్టల్ ప్రాసెసర్ తో పిక్చర్ చాలా స్పష్టంగా ఉంటుంది. హెచ్ డీఆర్ కు సపోర్టు చేయడంతో పాటు మెగా కాంట్రాస్ట్, యూహెచ్ డీ డిమ్మింగ్ ద్వారా మెరుగైన పనితీరు కనబరుస్తుంది. కనెక్టివిటీకి మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీ పోర్టు ఉన్నాయి. అలాగే టీవీలో వైఫై, బ్లూటూత్, ఈథర్నెట్ పోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. 20 డబ్ల్యూ అవుట్‌పుట్, Q-సింఫనీ స్పీకర్లతో ఆడియోను ఆస్వాదించవచ్చు. వెబ్ బ్రౌజర్, స్మార్ట్ థింగ్స్ హబ్, ఆపిల్ ఎయిర్ ప్లే తదితర వాటికి సపోర్ట్ చేస్తుంది. 4.1 రేటింగ్ గల 55 అంగుళాల ఈ సామ్సంగ్ ఎల్ఈడీ టీవీ అమెజాన్ లో 46,988కు లభిస్తుంది.
టీసీఎల్ (65 అంగుళాలు) మెటాలిక్ బెజెల్-లెస్ ఎల్ఈడీ టీవీ
ఇంటిలోనే థియేటర్ అనుభూతిని కలిగిస్తుంది. టీసీఎల్ 65 అంగుళాల టీవీలో 4కె అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, యూహెచ్ డీ ప్యానెల్, డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, హెచ్ డీఆర్ 10 కారణంగా విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్ బీపోర్ట్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. అంతర్నిర్మిత వైఫై, బ్లూటూత్, ఈథర్నెట్ తదితర అదనపు ప్రత్యేకతలున్నాయి. ప్రైవేట్ లిజనింగ్ కోసం హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ సౌకర్యం కూడా ఉంది. 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీతో 64 బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ తదితర యాప్ లను యాక్సెస్ చేయవచ్చు. వైడ్ వ్యూయింగ్ యాంగిల్, మైక్రో డిమ్మింగ్, మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ టీవీ 58 శాతం తగ్గింపుపై అమెజాన్ సేల్ లో 52,990కు అందుబాటులో ఉంది.
ఎంఐ (43 అంగుళాలు) ఎక్స్ సిరీస్ స్మార్ట్ గూగుల్ టీవీ
గదిలోని ఏమూల నుంచి అయినా టీవీలోని పిక్చర్ ను స్పష్టంగా చూడవచ్చు. ఈ 43 అంగుళాల టీవీ లో మూడు హెచ్ డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి. మీ సెట్-టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్, గేమింగ్ కన్సోల్, ఇతర పరికరాలను కనెక్ట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఈథర్నెట్ సులభంగా కనెక్ట్ అవుతాయి. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్, 2జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీ ఏర్పాటు చేశారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి వాటికి యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ టీవీ 44 శాతం తగ్గింపుతో అమెజాన్ లో రూ. 23,999కు అందుబాటులో ఉంది.
ఏసర్ (50 అంగుళాలు) అడ్వాన్స్ డ్ ఐ సిరీస్
పర్సనల్ కంప్యూటర్, గేమింగ్ కన్సోల్, ల్యాప్ ట్యాప్ లను కనెక్ట్ చేసుకోవడానికి డ్యూయల్-బ్యాండ్ వైఫై, 2-వే బ్లూటూత్, హెచ్ డీఎంఐ 2.1 పోర్ట్ తదితర అనేక ఎంపికలను కలిగి ఉంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో విజువల్ చాలా అందంగా కనిపిస్తుంది. కంటెంట్‌కు అనుగుణంగా ఐదు సౌండ్ మోడ్‌లున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లకు యాక్సెస్ లభిస్తుంది. శీఘ్ర ప్రాప్యత కోసం స్మార్ట్ టీవీ యొక్క వాయిస్-ప్రారంభించబడిన రిమోట్ మరియు హాట్‌కీలు నావిగేషన్‌ను బ్రీజ్‌గా చేస్తాయి. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనితీరు వేగంగా ఉంటుంది. ఈ 50 అంగుళాల టీవీకి 4 స్టార్ రేటింగ్ ఉంది. అమెజాన్ లో 44 శాతం తగ్గింపుపై రూ. 27,999కు లభిస్తుంది.