షాంపూలో ఈ 3 వేసి రుద్దితే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది

www.mannamweb.com


జుట్టుకి చాలా మంది షాంపూ చేస్తారు. అయితే, నేడు మార్కెట్లో లభించేవి కెమికల్స్‌తో నిండి ఉంటాయి. అలాంటివి వాడే బదులు నార్మల్ షాంపూలు వాడాలి. దీని వల్ల జుట్టుపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సాఫ్ట్‌గా పొడుగ్గా పెరుగుతుంది. దీంతో పాటు మనం వాడే షాంపూలో కొన్ని పదార్థాలను కలపడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయి. దీని వల్ల జుట్టు కూడా రిపేర్ అవుతుంది. ఆ పదార్థాలు ఏంటి? వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి?

కరివేపాకుల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. దీంతో పాటు కరివేపాకులోని ప్రోటీన్, బీటా కెరోటిన్ జుట్టు మూలాలని బలంగా చేస్తాయి. ఇందులోని ఐరన్, విటమిన్స్ స్కాల్ప్ పోషణకి చాలా మంచివి. జుట్టుని పెంచుతాయి. అంతేకాకుండా, జుట్టు చిట్లడం, రాలకుండా చేస్తాయి.

అలోవెరా జుట్టు, చర్మానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉంటాయి. వీటితతో పాటు ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ ఎ, బి12, సి, ఈలు ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్ళని ఆరోగ్యంగా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది. ఇది చుండ్రు, దురదని తగ్గిస్తుంది.

బియ్యం నీటిలో విటమిన్స్, పోషకాలు ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అమైనో యాసిడ్స్, విటమిన్స్ బి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీటిని వాడడం వల్ల వెంట్రుకలు చిక్కులు పడకుండా జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. బియ్యం నీటిలో షాంపూని కలిపి వాడడం చాలా మంచిది.

ఓ కప్పు నీటిలో గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ బియ్యం, తాజా కలబంద వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇందులో మీరు వాడే షాంపూని కలిపి జుట్టుని క్లీన్ చేయండి. ఇలా వారానికి రెండు, మూడు రోజులు చేస్తే జుట్టులోని మురికి మొత్తం పోయి జుట్టు అందంగా కనిపిస్తుంది.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.