దేవుడిచ్చిన ఆహార వరాల్లో కొబ్బరి ఒకటి, ఇదే లేకపోతే మనకెంత నష్టమో తెలుసా?

www.mannamweb.com


కొబ్బరి కేవలం ఉష్ణమండల ఆనందం మాత్రమే కాదు, ఇది ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా, ఈ పోషకమైన సూపర్ ఫుడ్ ను మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చాలో అన్వేషించండి.

ప్రపంచవ్యాప్తంగా వాడే ఆహారాల్లో కొబ్బరికాయలు ముఖ్యమైనవి. అన్నిదేశాల్లోనూ వీటి అవసరం ఎక్కువే. ఇవి మనకు చేసే మేలును గుర్తించే కొబ్బరి కాయల కోసం ప్రతి ఏడాది ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించారు. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహించుకుంటారు. ఆసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ కొబ్బరి కాయ దినోత్సవాన్ని ఏర్పరచింది.

మనదేశంలో ఏ చిన్న పూజ చేసినా కూడా కొబ్బరికాయ ఉండాల్సిందే. భారత్ లో కేరళ కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రామాయణ, మహాభారతాలలో కూడా వీటి కొబ్బరి ప్రస్తావన ఉంది. కొబ్బరి మన ఆహారంలో భాగం కాకపోతే మనకు ఎన్నో పోషకాల అందవు. ఇవి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటూ, జుట్టు, చర్మం సౌందర్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెను తలకు ఎన్నో వందల ఏళ్లుగా ఉపయోగిస్తున్నాం.

కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఫైబర్ నిండుగా

పోషకాలతో నిండిన కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇనుము, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి. ఎండిన, పచ్చి కొబ్బరితో తయారైన కొబ్బరి తురుములో 2 టేబుల్ స్పూన్లకు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీలైనంతగా కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోండి.
చర్మ ఆరోగ్యానికి…

కొబ్బరి నూనెను చర్మం, జుట్టుకు పూయడం ద్వారా తేమను కాపాడుకోవచ్చు. ఇది తేమను సమర్థవంతంగా లాక్ చేస్తుంది. పొడి చర్మం, పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది. చర్మ వ్యాధైన తామరను నిర్వహించడానికి సహాయపడుతుంది.
రక్తపోటు అదుపులో

కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గించడానికి

బరువు తగ్గాలనుకుంటే కేలరీల వినియోగాన్ని పెంచడానికి మీ పెరుగు లేదా ఓట్ మీల్ లో 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు జోడించండి. అదనంగా, కొబ్బరిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (ఎంసిటి) మీ ఆకలిని తీర్చడానికి, కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

మీ ఆహారంలో కొబ్బరిని ఇలా చేర్చండి

తాజా కొబ్బరి: తాజా కొబ్బరి ముక్కలను చిరుతిండిగా ఆస్వాదించండి. అదనపు రుచి కోసం ఫ్రూట్ సలాడ్లు లేదా గ్రీన్ సలాడ్లకు జోడించండి.
కొబ్బరి పచ్చడి: కొబ్బరి చట్నీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తినేటప్పుడు మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
ఎండు కొబ్బరి: కేకులు, పేస్ట్రీలకు టాపింగ్స్ గా ఎండిన కొబ్బరి ముక్కలను ఉపయోగించండి. క్రంచీ, నట్టి రుచి కోసం వాటిని గ్రానోలా, స్మూతీలలో కలపండి.
కొబ్బరి నీరు: ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే పానీయం కొబ్బరి నీరు. వ్యాయామాల తర్వాత శరీరంలో తేమను నింపడానికి కొబ్బరినీరు మంచిది. వేసవిలో తాగితే శరీరానికి చలువ చేస్తుంది.
కొబ్బరి లడ్డూ: ఈ తీపి స్వీట్ పండుగల సమయంలో చేస్తూ ఉంటారు. కొబ్బరికాయను ఆస్వాదించడానికి కొబ్బరి లడ్డూ మంచి మార్గం.
కొబ్బరి నూనె: ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే కొబ్బరి నూనె మితంగా ఉపయోగించినప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిని బేకింగ్, స్టిర్-ఫ్రైయింగ్లో చేర్చండి.
కొబ్బరి పాలు: శాకాహారులకు లాక్టోస్ లేని కొబ్బరి పాలు మంచి ప్రత్యామ్నాయం. స్మూతీలు, షేక్స్, సూపులలో, భారతీయ గ్రేవీలకు క్రీమ్నెస్ జోడించడానికి కొబ్బరి పాలు ఉపయోగించవచ్చు.
డెజర్టులు, షేక్స్: అదనపు రుచి కోసం తురిమిన కొబ్బరితో ఖీర్ లేదా ఫ్రూట్ కస్టర్డ్ వంటి డెజర్ట్లను చేసుకోవచ్చు. మామిడి లేదా అరటి వంటి షేక్స్ కు దీన్ని జత చేర్చండి.
కూరగాయలు, కూరలు: తురిమిన కొబ్బరిని కూరగాయలకు గార్నిష్ గా ఉపయోగించవచ్చు. లేదా రుచి, ఆకృతిని పెంచడానికి కూరలలో కలపవచ్చు.
కొబ్బరి వెన్న: తాజాగా తరిగిన కొబ్బరి నుండి తయారైన కొబ్బరి వెన్న టోస్ట్ మీద స్ప్రెడ్ చేయడం లేదా చేపలు లేదా చికెన్ వంటలలో ఉపయోగించడం వల్ల రుచికరంగా ఉంటుంది.