కొంతమంది తమ ఇళ్లను మనీ ప్లాంట్లతో అందంగా అలంకరిస్తుంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి మనీ ప్లాంట్‌లో నివసిస్తుందని హిందువులు భావిస్తుంటారు.
ఈ చెట్టును ఇంటికి తీసుకురావడం వల్ల సంపద పెరుగుతుందని అనేక మంది నమ్మకం. మనీ ప్లాంట్ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ మనీ ప్లాంట్‌ను ఇంటికి సరైన దిశలో ఉంచితే ఫలితం రెట్టింపవుతుంది.
ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటాలంటే.. మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలి. మనీ ప్లాంట్ గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఉత్తమ ఫలితాల కోసం మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ మూలలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది.
చాలామంది ఇంటిని మనీ ప్లాంట్‌గా అలంకరిస్తారు. ఇంటి ముందు తలుపు, బాల్కనీ లేదా ప్రవేశ ద్వారం ముందు మనీ ప్లాంట్లను ఉంచవచ్చు. మీరు మొక్క తీగలను ఇంటి పైకప్పుపై కూడా నాటవచ్చు. మనీ ప్లాంట్లు ప్రాథమికంగా ఇండోర్ మొక్కలు. మనీ ప్లాంట్‌లను ఇంటి లోపల, ఆరుబయట పెంచవచ్చు.
ఇంట్లో ఎండిన మొక్కలను వెంటనే తీసివేయాలి. మనీ ప్లాంట్ లేదా మరేదైనా మొక్క ఎండిపోయిన లేదా చనిపోయినట్లయితే జీవితంలో పేదరికాన్ని తెస్తుందని భావిస్తారు. మనీ ప్లాంట్ ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి.
ప్లాస్టిక్ కుండీలు లేదా టబ్ లలో మనీ ప్లాంట్లను నాటవద్దు. మనీ ప్లాంట్‌ను గాజు సీసాలో ఉంచాలి. ఆకుపచ్చ లేదా నీలం రంగు సీసాలు ఉపయోగించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతతో బాధపడరు. అలాగే మట్టి తొట్టెలలో కూడా మనీ ప్లాంట్లను నాటవచ్చు.