ఆధునిక కాలంలో ల్యాప్ టాప్‌ల వినియోగం అత్యవసరంగా మారింది. ప్రతి రోజూ నిర్వహించే వివిధ పనులకు చాలా ఉపయోగపడుతుంది. మినీ కంప్యూటర్ గా పేరున్న ల్యాప్ టాప్ లను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ప్రముఖ కంపెనీలు వివిధ రకాల ప్రత్యేకతలతో ల్యాప్ టాప్ లను విడుదల చేస్తున్నాయి. సాధారణంగా వీటిలో అనేక రకాలు ఉంటాయి. విద్య, ఉద్యోగ అవసరాలకు, అలాగే గేమ్ లు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఉంటాయి. అయితే హెచ్ పీ కంపెనీ విద్యార్థుల కోసం ఎన్ విడియా ఆధారిత విక్టస్ ఎడిషన్ పీసీలను విడుదల చేసింది, వీటి ధరలు రూ. 65,999 నుంచి ప్రారంభమవుతాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే చదువుతో పాటు గేమింగ్ కు ఉపయోగపడతాయి. విద్యార్థుల కోసం రూ.3,999 ఈఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
ప్రత్యేకతలు..
హెచ్ పీ విడుదల చేసిన ల్యాప్ టాప్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో 12 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. ఎన్ విడియా ఏఐ టెన్సర్ కోర్స్, డీఎల్ఎస్ఎస్ టెక్నాలజీ గేమింగ్ కు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే బ్యాటరీ చాలా గంటలు పనిచేస్తుంది. ప్రయాణం సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించుకోవచ్చు. దీనిలో 16 బీబీ సిస్టమ్ ర్యామ్, 70 డబ్ల్యూహెచ్ ఆర్ బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయి.
సృజనాత్మకను పెంచేలా..
ఎన్ విడియాలోని మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ ధూపర్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల్లో చదువుతో పాటు సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచేందుకు అధునాతన కంప్యూటింగ్ సాధనాలు ఎంతో అవసరం. హెచ్ పీ విక్టస్ ల్యాప్ టాప్ వారికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. దీనిలోని ఏఐ టెన్సర్ కోర్‌లతో కూడిన ఎన్ విడియా జీపీయూలతో విజువల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
ప్రత్యేక డిస్ ప్లే..
హెచ్ పీ ల్యాప్ టాప్ లో 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడా 15.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ. 2.29 కేజీల బరువు మాత్రమే ఉండడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లే వీలుంటుంది. ఓమెన్ టెంపెస్ట్ కూలింగ్ సొల్యూషన్ తో పరికరం వేడెక్కకుండా ఉంటుంది.
ఎంతో ఉపయోగం..
అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే గేమింగ్, ఎస్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి హెచ్ పీ తన గేమింగ్ గ్యారేజ్‌కి ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. అలాగే ఈడీఎక్స్ లో ఎస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, గేమ్ డెవలప్‌మెంట్‌లో ఆన్‌లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. గేమింగ్‌లో కెరీర్‌ను అన్వేషించాలనుకునే విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది.
ఈఎంఐ ఎంపిక..
హెచ్ పీ వరల్డ్ స్టోర్ట్స్, హెచ్ పీ ఆన్ లైన్, వివిధ మల్టీ-బ్రాండ్ అవుట్ లెట్ లలో హెచ్ పీ విక్టస్ స్పెషల్ ఎడిషన్ ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.65,999 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు నెలకు రూ.3999 ఈఎంఐ చెల్లించే విధానంలో వీటిని పొందవచ్చు. అలాగే వీటిని స్టోర్ ల నుంచి కొనుగోలు చేసినప్పుడు 6,097 విలువైన హైపర్‌ఎక్స్ క్లౌడ్ స్టింగర్ 2 హెడ్‌సెట్‌ను కేవలం రూ. 499కి అందజేస్తారు.