ఈ మధ్య కాలంలో చాలామందికి వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే ఇలా బెల్లీ ఫ్యాట్( Belly fat ) అనేది కనిపిస్తోంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లు దీనికి కారణం అని చెప్పవచ్చు.
అలాగే శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, లాంటివి ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇలాంటి విషయాలు తెలిసిన సరే ఎవరు కూడా పెద్దగా పాటించరు. ఇక పొట్ట కారణంగా ఇష్టంగా బ్రతకలేక బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడేవారు తమకు ఇష్టమైన దుస్తులను కూడా ధరించలేక పోతారు.
ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈ డ్రింక్ తీసుకుంటే కచ్చితంగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీలకర్ర( cumin ) అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని రోజు మనం పోపులో వేస్తూ ఉంటాం. అయితే ఇది బరువు తగ్గేందుకు, బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు కూడా మంచి ఔషధం అని చెప్పవచ్చు. పొట్టను కరిగించేందుకు రాత్రిపూట జీలకర్ర నీటిని తాగడం మంచిది. ఇక అల్లం టీ ( Ginger tea )కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఉన్న ఉపయోగాల గురించి చాలామందికి తెలిసి ఉండదు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంతోపాటు బెల్లీ ఫ్యాట్ ను కూడా కరిగిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత దీన్ని తాగడం మంచిది. క్యారెట్ జ్యూస్( Carrot juice ) కూడా పొట్టను తగ్గిస్తుందని చాలామందికి తెలిసి ఉండదు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ కొవ్వును కరిగించేందుకు బాగా సహాయం చేస్తుంది. చాలామందికి పుచ్చకాయ జ్యూస్ తో కలిగే ప్రయోజనాల గురించి కూడా పెద్దగా తెలిసి ఉండదు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో 90% నీరు ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ ను కరిగించడంలో కీలకంగా పనిచేస్తుంది.
ఇక గోరువెచ్చని నీటిలో, నిమ్మకాయ రసం వేసి కలుపుకొని తాగడం చాలా మంచిది. అలాగే ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ లో చియాసిడ్ ను జోడించి తాగడం వలన ఆకలిని తగ్గించి బెల్లి ఫ్యాట్ కరగడం ఖాయం. కాబట్టి రాత్రిపూట ఈ డ్రింక్స్ ను తాగడం వలన బెల్లీ ఫ్యాట్ వెంటనే తగ్గిపోతుంది.