రూ. 10 వేలలో సూపర్ ఫోన్‌.. భారీ స్క్రీన్‌, మంచి కెమెరాతో పాటు..

www.mannamweb.com


ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ఫోన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా రూ. 10 వేలలోపు మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ06 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. గ్యాలక్సీ ఏ06 పేరుతో తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను, భారీ కెమెరాను, బ్యాటరీని అందించారు.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ06 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే 2 ఎంపీతో కూడిన సెకండరీ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీ+ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ధర విసయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 9,999గా నిర్ణయించారు. అయితే 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 11,499గా నిర్ణయించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో బ్లూటూత్ v5.3 GPS, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. సెక్యూరిటీ విషయానికొస్తే ఇందులో.. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌ను అందించారు.