లక్షలాది మంది ఎదురు చూపు.. రాత్రి 10.30 గంటలకు గ్రాంట్‌ ఈవెంట్‌

ఆపిల్‌ నుంచి కొత్త ఐఫోన్‌ వస్తుందంటే చాలా లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. ఆపిల్‌ నుంచి కొత్త ఫోన్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురు చూస్తుంటారు.


నేడు (సెప్టెంబర్‌ 9)న ఐఫోన్‌-16 మోడల్‌ విడుదల కానుంది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు Apple తన ఈవెంట్‌ట్‌లో ఈ ఫోన్‌ ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా కంపెనీ ఐఫోన్ 16 సిరీస్, 16 ప్రో సిరీస్‌లను లాంచ్ చేస్తుంది. ఈ ఈవెంట్ సమయంలో కంపెనీ ఇతర ఫోన్‌లను కూడా ప్రారంభించవచ్చు. ఇందులో భాగంగా Apple Series 10, Apple Ultra 3, Apple SE మోడల్‌లు కావచ్చు.

ఆపిల్ ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ, ఏ సమయంలో చూడవచ్చో తెలుసుకుందాం. మీరు ఈ Apple ఈవెంట్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Apple TV, YouTubeలో ప్రత్యక్షంగా చూడవచ్చు. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి మీరు ఆపిల్ ఛానెల్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ ఐఫోన్లు లాంచ్:

ఆపిల్‌ ఈ ఈవెంట్‌లో iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max లాంచ్ అవుతుంది. గత సంవత్సరం, ఐఫోన్ 15, 15 ప్రో సిరీస్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా అప్‌గ్రేడ్‌లు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కంపెనీ కొత్త డిజైన్, కొత్త కెమెరా సెన్సార్, చిప్‌సెట్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు.

ఐఫోన్ 16లో కెమెరా సెటప్ డిజైన్ :

iPhone 16 కెమెరా సెటప్ డిజైన్ iPhone 11 కెమెరా డిజైన్‌ను గుర్తు చేస్తుంది. ఇది క్యాప్సూల్ వంటి డిజైన్ కావచ్చు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కంపెనీ అదే రంగు వేరియంట్‌లను పరిచయం చేయనుందని తెలుస్తోంది. అవి నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, తెలుపు రంగులలో ఉండే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌ 16లో అత్యధునిక ఫీచర్స్‌ను జోడించినట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.