డ్రై ఫ్రూట్స్‌లో బాదాంని మించిన మరోకటి లేదు. బాదాంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బాదం కంటే టైగర్ నట్స్ మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి చిన్నగా, గుండ్రని ఆకారంలో ఉండే పండ్లు. ఈ నట్స్ ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తారు. తియ్యంగా ఉంటాయి ఈ గింజలు.
టైగర్ నట్స్ పోషకాల గని అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాదం తినడం వల్ల వచ్చే లాభాలు కంటే ఈ టైగర్ నట్స్ మరింత మేలని నిపుణులు అంటున్నారు.
ఈ నట్స్ తినడం వల్ల బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పొట్ట నిండిన భావన కలిగి ఇతర ఆహారాలు తినలేం.
టైగర్ నట్స్ తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. అదే విధంగా గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇవి చక్కగా సహాయ పడతాయి. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
అలాగే ఈ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెద్ద మొత్తంలో లభిస్తాయి. వీటి తింటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. బాదం పప్పును ఎలా తీసుకుంటామో టైగర్ నట్స్ కూడా అలాగే తీసుకోవచ్చు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.