భారత్‌లో విడుదలైన ఐఫోన్‌ 16.. అదిరిపోయే ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా?

www.mannamweb.com


ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ ఆపిల్ తన ఐఫోన్ 16 విడుదల చేసింది. iPhone 16, iPhone 16 Plus ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 10 నుండి ఆపిల్‌ వెబ్‌సైట్‌లో, భారతదేశంలోని ఆపిల్‌స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

అయితే ఈ ఫోన్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. Apple iPhone 16, iPhone 16 Plusలలో A18 బయోనిక్‌ని అందించింది. ఈ రెండు iPhoneల బుకింగ్ సెప్టెంబర్ 10 నుండి ఆన్‌లైన్ ఆపిల్‌ వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ ఆపిల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను అందించింది.

iPhone 16, 16 Plus 16MP, 18MP కెమెరాలను కలిగి ఉంటాయి. దీనితో పాటు, ఈ రెండు ఐఫోన్‌లు ఇంటెలిజెన్స్ కంట్రోల్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంటాయి. దీని ద్వారా మీరు ప్రొఫెషనల్ కెమెరాతో మంచి ఫోటోలను క్లిక్ చేయవచ్చు.

ధరలు:

యాపిల్ ఐఫోన్ 16ని భారతీయ కరెన్సీ ప్రకారం.. ఐఫోన్‌-16 128జీబీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.79,900. 512జీబీ వేరియంట్‌ ధర రూ.1,09,900, ఐఫోన్‌-16 ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.89,900 ఉండగా, 256జీబీ ధర రూ.99,900 ఉండనుంది. అలాగే 512 వేరియంట్‌ ధర రూ.1,19,900 ఉండగా, ఐఫోన్‌ 16 ప్రో 128జీబీ ధర రూ.1,19,900 ఉండగా, 1టీబీ వరకు ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.1,69,900 ఉంది. ఇక ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,44,900 ఉంది.

iPhone 16, iPhone 16 Plus స్పెసిఫికేషన్‌లు:

Apple iPhone 16, iPhone 16 Plusలలో 6.1, 6.7 అంగుళాల స్క్రీన్‌లను అందించింది. దీనితో పాటు, మీకు iPhone 16, iPhone 16 Plusలలో ఫోకస్, డెప్త్ కంట్రోల్ ఫీచర్‌తో రాబోయే జనరేషన్‌ పోర్టాసోనిక్ అందించబడింది. అలాగే మాక్రో ఫోటోగ్రఫీని కూడా చేయవచ్చు. ఆటో ఫోకస్‌తో డెప్త్ కెమెరాతో సుదూర ఫోటోలను తీయవచ్చు.

శాటిలైట్ ఫీచర్స్‌

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మునుపటి ఐఫోన్‌ల మాదిరిగానే శాటిలైట్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 15లో శాటిలైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు, కంపెనీ దీనిని అమెరికాలో మాత్రమే విడుదల చేసింది. అయితే ఈసారి శాటిలైట్ ఫీచర్‌ను 17 దేశాలలో ప్రవేశపెట్టారు.