ప్రస్తుతం వాచ్‌కు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకునే గ్యాడ్జెట్. కానీ వాచ్‌తో చేయలేని పని అంటూ లేదు. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త వాచ్ తీసుకొచ్చారు. ఇంతకీ వాచ్ ఏంటి.? ఇందులో ఉన్న ఆ ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫైర్ బోల్ట్ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. ఫైర్‌బోల్ట్ స్నాప్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు.
ఈ స్మార్ట్ వాచ్‌లో సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం. దీంతో వాచ్‌తోనే వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ ఫోన్ 4జీ నానో సిమ్ స్లాట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో సిమ్ కార్డుతో నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌లో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.
ఈ వాచ్‌కు అచ్చంగా స్మార్ట్ ఫోన్‌లాగే పనిచేస్తుంది. ప్లే స్టోర్‌తో వచ్చే ఈ వాచ్‌లో అన్ని రకాల యాప్స్‌ను డౌనల్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటీటీలను కూడా వీక్షించొచ్చు. ఇందులో 1000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇక ఈ వాచ్‌ను 2జీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వంటి వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. గేమ్స్‌కి కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
ధర విషయానికొస్తే ఈ వాచ్ అసలు ధర రూ. 24,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 5999కే సొంతం చేసుకోవచ్చు. 76 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.