షావోమీకి చెందిన 43 ఇంచెస్ టీవీపై అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివ్ సేల్‌లో మంచి డీల్ లభిస్తోంది. షావోమీ 43 ఇంచెస్‌తో ప్రో 4కే డాల్బీ విజన్ ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా రూ.
20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి లభిస్తోంది. అయిలతే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2500 వరకు తగ్గింపు ధరకు లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 24 వేలకే సొంతం చేసుకోవచ్చు.
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే ఈ టవీలో 30 వాట్స్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.
కంపెనీ ఈ టీవీపై ఏడాది వారంటీ అందిస్తోంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. టీవీ రిమోట్ బ్లూటూత్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు.
వైఫై, యూఎస్‌బీ, ఇథర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 60 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్ ఈ టీవీ స్క్రీన్ సొంతం. ఇక ఈ టీవీ బరువు 6 కిలోలుగా ఉంది.