చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ హానర్ స్మార్ట్ ఫోన్‌లతో పాటు కొత్త ట్యాబ్స్‌ను సైతం లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి హానర్ ప్యాడ్ ఎక్స్8ఏ పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో కూడిన ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి పవర్ ఫుల్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ ఎక్స్8ఏ పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. ఫీచర్ల విషయానకొస్తే ఈ ట్యాబ్‌లో 11 ఇంచెస్‌తో కూడిన భారీ డిస్‌ప్లేను అందించారు.
90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇక కంటిపై ఎలాంటి ప్రభావం పడకుండా ఇందులో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను అందించారు. దీంతో కళ్లపై ఎఫెక్ట్ తక్కువగా పడుతుంది.
ఇక ఈ ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఆడ్రినో 610 జీబీయూ గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. దీంతో గేమ్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవచ్చు. 4జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ను మరో 4జీబీ వరకు ర్యామ్‌ను పొడగించుకోవచ్చు.
స్టోరేజ్ విషయానికొస్తే ఇందులో 128 జీబీ కెపాసిటీని అందించారు. ఎస్‌డీ కార్డు సహాయంతో 1 టీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌లో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు.
అలాగే ఈ ట్యాబ్‌లో 8300 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. ధర విషయానికొస్తే హానర్ ప్యాడ్ ఎక్స్ 8ఏ ధర రూ. 12,999గా నిర్ణయింఆచరు. స్పేస్ గ్రే కలర్‌లో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌లో ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది.