మీ కూతురి భవిష్యత్తు కోసం LIC సూపర్ స్కీమ్.. నెలకు 2,250 కడితే చాలు.. చేతికి 14 లక్షలు

www.mannamweb.com


కూతురు భవిష్యత్తుకోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తుంటారు. ఆమె భవిష్యత్తు కోసం ఎన్నో కలలుకంటుంటారు. విద్యాబుద్దులు నేర్పించి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఏ కష్టం దరిచేరనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. తమ గారాల పట్టి చదువులకు, పెళ్లి ఖర్చులకు ఏలోటు రాకుండా చూడాలని ఆరాటపడుతుంటారు పేరెంట్స్. కాగా ఆడపిల్ల పుడితే ఇప్పటికీ కొంతమంది గుండెల మీద కుంపటిలాగ భావిస్తున్నారు. పురిటిలోనే ఆడబిడ్డల ప్రాణాలు తీసిన కఠినాత్ములు కూడా ఉన్నారు. అయితే ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందనుకునేలా ప్రభుత్వాలు అద్భుతమైన స్కీమ్స్ ను తీసుకొస్తున్నాయి.

ఆడపిల్లను రక్షించేందుకు, వారిని ఎదగనిచ్చేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ఆడబిడ్డలు గల తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేలా సుకన్య సమృద్ధి యోజన పథకం, ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ లో బిడ్డల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మీ కూతురి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అందించే కన్యాదాన్ పాలసీ ఆడపిల్లల కోసం బెస్ట్ స్కీమ్. ఇందులో రోజుకు 75 కడితే.. 14 లక్షలు పొందొచ్చు. ఇందులో పొదుపు చేస్తే భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకోవచ్చు.

ఆడపిల్ల చదువుకు, పెళ్లి ఖర్చులకు ఇబ్బంది కలగకూడదంటే కన్యాదాన్ పాలసీ బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఇందులో చేరితే లక్షల్లో లాభం పొందొచ్చు. ఆడపిల్లలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఎల్ఐసీ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పేరెంట్స్ తమ కూతురు పేరు మీద ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవచ్చు. కుమార్తె వయసు కనీసం సంవత్సరం ఉండాలి. అలానే పాలసీ హోల్డర్ తండ్రి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. 13-25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీ కొనసాగించొచ్చు. ప్రభుత్వానికి చెందిన పాలసీ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ ద్వారా ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ. 75 పొదుపు చేస్తే.. అంటే నెలకు రూ. 2,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నెలవారీ ప్రీమియం 25 ఏళ్ల పాటు చెల్లించాలి. మెచ్యూరిటీ కాలానికి చేతికి 14 లక్షలు అందుతాయి. ఈ డబ్బుతో మీ కూతురు చదువు, పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. మీ కూతురికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించొచ్చు. ఈ పాలసీలో చేరితే పాలసీదారుడు సహజ కారణాలతో మరణిస్తే.. రూ. 5 లక్షల డెత్ బెనిఫిట్ లభిస్తుంది. ప్రమాదం కారణంగా అయితే 10 లక్షల డెత్ బెనిఫిట్ పొందొచ్చు. లోన్ కూడా పొందొచ్చు. ఎల్ఐసీ కన్యాదాన్ ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.