దేశంలో ఈ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి

www.mannamweb.com


విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో ఒక రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ అవసరమని మీకు తెలుసా?

నమ్మశక్యంగా లేదుకదా..! ఇది నిజమే. పాస్‌పోర్ట్, వీసా అవసరమయ్యే రైల్వే స్టేషన్ భారతదేశంలో ఉంది. అదెక్కడో తెలుసుకుందాం. ఈ స్టేషన్ అటారీ శ్యామ్ సింగ్. పంజాబ్‌లోని ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే పాస్‌పోర్ట్-వీసా అవసరం. ఎందుకో తెలుసా? ఈ స్టేషన్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు పక్కనే ఉంది. ఇది అమృత్‌సర్-లాహోర్ లైన్‌లో భారతదేశంలోని చివరి స్టేషన్.

ఇంతకుముందు భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంఝోతా ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తున్నప్పుడు, రైలు పంజాబ్‌లోని ఈ అత్తారి స్టేషన్ నుండి బయలుదేరింది. అట్టారీ స్టేషన్ నుండి రైలు ఎక్కే ముందు భారతీయ పాస్‌పోర్ట్, వీసా చూపించాలి. అదేవిధంగా పొరుగు దేశాల నుంచి రైలు వస్తున్నప్పుడు ప్రయాణికుల పాస్‌పోర్టులు, వీసాలు చెల్లుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. అయితే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కారణంగా రైలు సర్వీసును నిలిపివేశారు.

అయినప్పటికీ, స్టేషన్ ఇప్పటికీ ఉంది. 24/7 గట్టి భద్రత ఉంటుంది.స్టేషన్‌కు సాయుధ బలగాలు కాపలాగా ఉన్నాయి. అలాగే సీసీటీవీ ద్వారా నిఘా ఉంటుంది. ఈ స్టేషన్ ఇండియా-పాకిస్తాన్ వాఘా అంతర్జాతీయ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఒక పర్యాటకుడు అటారీ స్టేషన్‌ను సందర్శిస్తే, అతన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ప్రవేశించడానికి అనుమతిస్తారు. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి లేదు.

Passport and visa are mandatory