బెంజ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, ఫీచర్స్, ధర.. దేనిలోనూ తగ్గేదేలా!

www.mannamweb.com


లగ్జరీ కార్లలో ప్రత్యేక గుర్తింపు కలిగినది మెర్సిడెస్ బెంజ్. ప్రపంచ వ్యాప్తంగా దీనికి కస్టమర్ బేస్ ఉంది. చరిత్ర కలిగి బ్రాండ్ ఇది. ఈ కారు కలిగి ఉండటమే పెద్ద హోదాగా కూడా ఫీల్ అయ్యే వారు ఉన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ షురూ అయ్యింది కాదా. దీనిని అందిపుచ్చుకుంటూ ఈ జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును లాంచ్ చేసింది. ఇప్పటికే బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ వేరియంట్లో సెడాన్, ఎస్‌యూవీలు మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే మే బ్యాక్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ లాంచ్ చేసింది. దీనికి కొనసాగింపుగా మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ 580 4 మ్యాటిక్ పేరుతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.41కోట్లు(ఎక్స్ షోరూం). కాగా దీనికి ముందు మోడల్ మెర్సిడెస్ మేబ్యాక్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ ధర మాత్రం రూ. 2.25కోట్లుగా ఉంది. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఫోర్ట్ ఫోలియోలో ఈక్యూఎస్ సెడాన్, ఈక్యూఈ ఎస్‌యూవీ, ఈక్యూఏ, ఈక్యూబీ, ఈక్యూఎస్ ఎస్‌యూవీ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈక్యూఎస్ ఎస్‌యూవీ, ఈక్యూఎస్ సెడాన్, ఈక్యూఈ ఎస్‌యూవీ తర్వాత మేబ్యాక్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ కారు కంపెనీ నుంచి వస్తున్న నాల్గో టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ కారు. ఇప్పుడు కొత్త కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4 మ్యాటిక్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్..

ఈ కొత్త కారు లుక్ మిగిలిన ఈక్యూ ఎలక్ట్రిక్ కారు మోడళ్లలాగానే ఉంటుంది. దీనిలో కాసత్ మెరుగైన ఏరోడైనమిక్స్ కలిగి ఉంటుంది. దీని పరిమాణం చూస్తే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్‌యూవీ కన్నా కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ కారుకు పెద్ద బ్లాక్ ప్యానల్ గ్రిల్, కోణీయ ఎల్ఈడీ లైట్లు, ముందు భాగంలోనూ ఎల్ఈడీ లైట్ బార్ కలిగి ఉంటుంది. 21 అంగుళాల ఏఎంజీ లైన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది. స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లను ఏఎంజీ లైన్ ప్యాకేజీ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ పవర్, రేంజ్..

బెంజ్ నుంచి చాలా ఎలక్ట్రిక్ వెర్షన్ కార్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ 580 4 మ్యాటిక్ ఒక్కటే మన దేశంలో లాంచ్ అయ్యింది. దీనిలో 118కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 809 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఒక్కో యాక్సిల్లో ఒకటి. కొన్ని అసాధారణమైన మృదువైన, బలమైన ప్రొపల్షన్ను కలిగి ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ 537 హెచ్పీ పవర్, 858 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని ఈ కారు అందుకోగలగుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ వివిధ డ్రైవింగ్ పరిస్థితులలో సరైన ట్రాక్షన్, హ్యాండ్లింగ్ ను అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ ఇంటీరియర్..

అ కార్లు అల్ట్రా విలాసవంతంగా ఏమి ఉండదు. 7 సీట్ల లే అవుట్తో మాత్రమే ఉంటుంది. లోపల 12.3-అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, 17.7 అంగుళాల సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 12.3- అంగుళాల ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్తో కూడిన ట్రిపుల్ స్క్రీన్లతో క్యాబిన్ ‘హైపర్స్క్రీన్’ని పొందుతుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్తో ఐచ్ఛిక హెడ్-అప్ డిస్ ప్లే కూడా ఉంటుంది. లెదర్ అప్ హెూలర్డ్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఫైవ్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాస్ లెవెల్ 2, తొమ్మిది ఎయిర్ బ్యాగ్ లతో భద్రతకు భరోసా ఇస్తుంది.