ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు..

www.mannamweb.com


అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు బట్టలు బహుకరించారు.

ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే వుంటాం. శివేంద్ర గారికి థాంక్. దేవదాస్ తో పాటు మరికొన్ని లు చూడబోతున్నారు. వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా వున్నాయి. ఆడియన్స్ కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్ లో ఫాంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా వుంది. పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారికి థాంక్యూ. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్ళకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ హాగ్ చేసుకొని ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా వుందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ గారు ఆవార్డ్ ప్రధానం చేస్తారు. అక్టోబర్ 28 ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు కె రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. అక్కినేని, కోవెలమూడి కుటుంబాలు రెండు వేరువేరు కాదు. నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కి అన్నపూర్ణ స్టూడియోని తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. దేవదాస్, కాళిదాస్, విప్రనారాయణ ఇలా ఎన్నో క్లాసిక్ లు ఇచ్చారు. అలాంటి నటన, లు మళ్ళీ చూడగలమా అన్నంత గొప్పగా చేసిన ఘటన నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు ఎప్పుడూ మనతోనే వుంటారు. తండ్రి కొడుకులతో లు చేసిన అదృష్టం నాకు దొరికింది. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా మనతోనే వుంటారు’ అన్నారు.