మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వానలే వానలు

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఎండ, ఉక్కబోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే స్వీట్ న్యూస్‌ను చెప్పింది.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం నుంచి ఎల్లుండి వరకు భారీ వానలు పడుతాయని అంచనా వేసింది. హైదరాబాద్ ​సిటీలో 2 రోజులపాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణం కేంద్రం చెప్పింది..హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

రాగాల మూడు గంటలలో ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయి. శనివారం అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు వానలు పడతాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.