బడ్జెట్లో బెస్ట్ లగ్జరీ SUV కార్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

www.mannamweb.com


ప్రస్తుతం మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీలకు మామూలు డిమాండ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే వీటిని మనం తక్కువ బడ్జెట్‌లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఇవి గ్రాండ్ లుక్‌ కలిగి ఉంటాయి. లగేజీ పెట్టుకోవడానికి సరిపడా మంచి స్పేస్ ఉంటుంది. ఇంకా అప్డేటెడ్ ఫీచర్లు ఉంటాయి. వీటన్నిటిని మించి వీటిలో పవర్ ఫుల్ ఇంజన్ ఉంటుంది. మీకు ఈ సెగ్మెంట్‌లో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్లు మంచి ఫీచర్లతో మాత్రమే కాకుండా అందుబాటు ధరలోనే వస్తాయి. మంచి మైలేజీని కూడా అందిస్తాయి. ఇక ఈ కాంపాక్ట్ SUV కార్ల ధర, మైలేజ్, ఫీచర్లు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నెట్.. మాగ్నైట్ అందమైన లగ్జరీ SUV. దీని డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కారులో మంచి స్పేస్ ఉంటుంది. ఈ కార్ రెండు పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. దీని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే 70 bhp పవర్, 96 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే 97 bhp పవర్, 160 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఫిక్స్ చేసి ఉంటాయి. ఇక టర్బో పెట్రోల్ ఇంజన్‌లో అయితే మనకు సివిటి గేర్‌బాక్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ కారులో లగేజీ పెట్టుకోడానికి 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సేఫ్టీ విషయంలో ఈ 4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కార్ లో EBD తో ABS, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే.. ఇది రూ.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 20 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుంది.

టాటా పంచ్.. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ SUV ఇది. ఈ కార్ కి 90 డిగ్రీల ఓపెన్ డోర్స్ ఉన్నాయి. దీనిలో చాలా మంచి స్పేస్ ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 86 PS పవర్, 113 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. ఈ కార్ ఏకంగా 20.1 కిలోమీటర్లు దాకా మైలేజీని అందిస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD, ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో లగేజీని పెట్టుకోడానికి 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర వచ్చేసి రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్.. ఇది భారతదేశంలో బాగా పాపులారిటీ పొందింది. ఇందులో కూడా స్పేస్ బాగుంది. ఈ కార్ 1.2L కప్పా పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 83 PS పవర్‌, 113.8 Nm టార్క్‌ ని జనరేట్ చేస్తుంది.ఈ కార్ 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ కార్ 19.4 కిలోమీటర్లు దాకా మైలేజీని అందిస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 391 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ ఎక్స్-షో రూమ్ ధర రూ. 6 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది.