ముంబై నటి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ అయింది. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్‌తో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది. విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు… సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
కుక్కల విద్యాసాగర్ అరెస్ట్‌తో సంచలనల విషయాలు బయటకు వస్తాయా..? ఐపీఎస్‌ల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా..? తెర వెనక రహస్యాలు బట్టయలవుతాయా..? ముంబై హీరోయిన్ కేసులో ఇంకెన్నీ టిస్ట్‌లు చోటుచేసుకోనున్నాయి..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ బర్నింగ్ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. మరోవైపు కేసు కీలక దశకు చేరిన నేపథ్యంలో జత్వానీకి భద్రత కల్పించారు.
మరోవైపు ముంబయి నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. ముంబయి నటి కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని కాంతిరాణా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కుక్కల విద్యాసాగర్ విచారణతో జత్వానీ కేసు ఏ వైపు మలుపు తిరుగుతుందో, ఎందరి పేర్లు బయటికి వస్తాయోనని ఆసక్తి నెలకొంది.