ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి.

www.mannamweb.com


హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది.

ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. అయితే, తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని అంటున్నారు అదేంటంటే..

పురాణాల ప్రకారం..వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసీ దేవి నదిలోంచి బయటకు వస్తుంది. ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. కానీ, గణేషుడు ఆమెను నిరాకరించగా.. ఆగ్రహించిన తులసి..నీవు రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట.! అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు.

అలాగే, కొందరు కార్తీకమాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు. అలా ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే.. తులసి మహా విష్ణువుకు ప్రీతికరమైనది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.

ఇకపోతే, పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త వంటివి ఉంచకూడదు. చీపురుని ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు. ఆ చీపురుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట. ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి. తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది. తులసి చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వెంటనే తీసేయండి.

తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. కావున తులిసి చెట్టు వద్ద చెప్పులు ఉన్నట్లయితే ఇంట్లో ఆనందం కరువు అవుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉండకూడదు. తులసి దగ్గర ముళ్ల మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగెటివిటీ వ్యాపిస్తుంది.